BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BC Reservations: స్థానిక ఎన్నికలకు అంతా సిద్ధం అవుతున్న సమయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. ఈ రిజర్వేషన్లపై తీసుకొచ్చిన జీవోలను కొట్టివేసింది.. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, తదుపరి న్యాయపరమైన చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌లలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ జీవో నంబర్ 105ను జారీ చేసింది. పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లపై పురపాలక శాఖ జీవో నంబర్ 1065ను జారీ చేసింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
విచారణ సందర్భంగా రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ఉపయోగించిన గణాంకాలు, వాటి ఆధారాలను హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం మాత్రం బీసీల సమకాలీన జనాభా వివరాల కోసం నిర్వహించిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా 34 శాతం రిజర్వేషన్లు నిర్ణయించినట్లు కోర్టుకు వివరించింది. తాజాగా హైకోర్టు జీవో 105, జీవో 1065లను కొట్టివేసింది. రిజర్వేషన్ల అంశంలో రాజ్యాంగ, న్యాయపరమైన పరిమితులను పాటించలేదని కోర్టు పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో హైకోర్టు తీర్పుపై తదుపరి న్యాయపరమైన మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇదిలా ఉండగా, హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో ఒకవైపు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన చర్యలు కొనసాగుతుండగా, మరోవైపు 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకునే తదుపరి న్యాయపరమైన నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
Also Read
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!