BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BC Reservation: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయతీరాజ్, పురపాలక శాఖలు జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను అనుమతిస్తూ, ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ)ను ఆదేశించింది.
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియ కొనసాగుతోందనే కారణంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. తుది ఓటర్ల జాబితా ప్రచురణ విషయంలో పంచాయతీరాజ్, పురపాలక శాఖలు చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది. సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం డిస్పోజ్ చేసింది.
Also Read
బీసీ జనగణన చేపట్టి, రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. అలాగే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను ఉపవర్గీకరణ చేసి రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ దాఖలైన మరో పిల్‌ను కూడా కొట్టివేసింది. వార్డుల పునర్విభజన ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీళ్లలోనూ హైకోర్టు జోక్యం చేసుకోలేదు. సెన్సెస్ కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్ వార్డుల పునర్విభజనపై ప్రభావం చూపబోదని స్పష్టం చేసింది.
ఇక, రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ 2021 జూన్ 9న తీసుకొచ్చిన ఏపీ మున్సిపాలిటీ సవరణ చట్టం (యాక్ట్ 5/2021)ను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కూడా హైకోర్టు కొట్టివేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు, సర్ ప్రక్రియ, వార్డుల పునర్విభజన, గ్రామాల విలీనం వంటి అంశాలపై దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పు వెలువరించింది.
తాజావార్తలు
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!