Site icon NTV Telugu

AP Government: పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై సర్కార్‌ సీరియస్‌.. ఫిర్యాదుకు రంగం సిద్ధం

Pawan

Pawan

AP Government: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది.. ఫిర్యాదుకు రంగం సిద్ధం చేస్తోంది.. సంబంధిత కోర్టులో ఫిర్యాదు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్‌ చేసిన హ్యూమన్‌ ట్రాఫికింగ్ ఆరోపణలను సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం.. తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు సూచించింది..

Read Also: Heavy Rains: ముంబైలో దంచికొడుతున్న వానలు.. ఓ గ్రామంపై విరిగిపడ్డ కొండచరియలు

కాగా, వారాహి విజయాత్ర పేరుతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించారు పవన్‌ కల్యాణ్‌.. ఇక, రెండో విడత వారాహి యాత్రలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌ తీసుకొచ్చిన వాలంటీర్‌ వ్యవస్థపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. వాలంటీర్‌ వ్యవస్థపై త్వరలోనే కోర్టుకు వెళ్తామని ప్రకటించిన ఆయన.. గ్రామ, వార్డు వాలంటీర్ల రూపంలో ప్రతి 50 ఇళ్లకు ఒక జగన్‌ తయారయ్యాడని ఆరోపించారు.. ఇక, వారు సేకరించిన సమాచారాన్ని ఎక్కడ ఉంచుతున్నారని ప్రశ్నించారు. వ్యక్తిగత సమాచారం సేకరించేందుకు అసలు వాలంటీర్లు ఎవరని నిలదీశారు. సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్‌ వ్యవస్థ తోడ్పాటు అందిస్తోందని ఆరోపించిన ఆయన.. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌కి కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, పవన్‌ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది.. వలంటీర్లపై దురద్దేశపూర్వకంగా పవన్‌ ఈ వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.. పవన్‌ దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేశారు.. ఇప్పుడు.. పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Exit mobile version