NTV Telugu Site icon

Andhra Pradesh: ఆన్‌లైన్‌లో భ‌వ‌న నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల సేవలు నిలిపివేత

Ap Govt

Ap Govt

Andhra Pradesh: భ‌వ‌న నిర్మాణాలు, లేఅవుట్లకు ఆన్ లైన్‌లో అనుమ‌తులు జారీ చేసే పోర్టల్‌లో మార్పులు చేస్తోంది ప్రభుత్వం. ఈ మార్పుల్లో భాగంగా ప‌లు రోజుల పాటు ఆన్‌లైన్ అనుమ‌తుల సేవ‌లు నిలిపివేస్తున్నట్లు ప‌ట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు. స‌ర్వర్ మైగ్రేష‌న్, డేటా మైగ్రేష‌న్‌లో భాగంగా వ‌చ్చే నెల నాలుగో తేదీ వ‌ర‌కూ సేవ‌లు అందుబాటులో ఉండ‌వ‌ని పేర్కొన్నారు. ప్రస్తుతం భ‌వ‌నాల నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమ‌తుల‌ను డీపీఎంఎస్(DPMS)వెబ్ సైట్ ద్వారా జారీ చేస్తున్నారు.

Read Also: Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

దీనికి సంబంధించిన స‌ర్వర్ తో పాటు డేటా అంతా ప్రైవేట్ సంస్థ అయిన అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్‌లో ఉంది. ఈ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని స్టేట్ డేటా సెంట‌ర్‌కు బ‌ద‌లాయిస్తున్నట్లు తెలిపారు. తిరిగి వెబ్ సైట్ అందుబాటులోకి రాగానే భ‌వ‌నాలు,లేఅవుట్లకు అనుమ‌తుల‌ను య‌ధావిధిగా ఆన్‌లైన్‌లో జారీ చేస్తామ‌ని విద్యుల్లత స్పష్టం చేశారు. ప్రజ‌లు,బిల్డర్లు,డెవ‌ల‌ప‌ర్లు, ఇంజినీర్లు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోరారు.