NTV Telugu Site icon

AP Govt: స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను రద్దు చేసిన ప్రభుత్వం

Ap Govt

Ap Govt

AP Govt: స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో-సెబ్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్‌ను ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన 12 జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్ విభాగానికి గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెబ్ సిబ్బందిని ఎక్సైజ్ శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సెబ్ విభాగంలో వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులను వారి మాతృశాఖల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Andhra Pradesh: వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

సెబ్‌కు చెందిన ఫర్నిచర్, వాహనాలు, కంప్యూటర్లు, అద్దె భవనాలను ఎక్సైజ్ శాఖకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్సైజ్ శాఖలోని 70 శాతం ఉద్యోగులను.. సిబ్బందిని సెబ్‌కు గత ప్రభుత్వం కేటాయించింది. ఇన్నాళ్లూ ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా సెబ్ పని చేసింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.