Site icon NTV Telugu

Minister Buggana Rajendranath: బడ్జెట్‌లో సంక్షేమానికే పెద్ద పీట

Buggana

Buggana

Minister Buggana Rajendranath: బడ్జెట్‌లో సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ స్పష్టం చేశారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథం గా భావించిన రాజకీయ పార్టీ వైసీపీ, రాజకీయ నాయకుడు జగన్ అని మంత్రి వెల్లడించారు. 99 శాతం హామీలను శాచ్యురేషన్ పద్ధతిలో అమలు చేశామన్నారు. ఇలా అమలు చేయటంలో జగన్ విధానాలే ఇతర రాజకీయ పార్టీలకు ఒక బెంచ్ మార్క్ అయ్యిందన్నారు. కొవిడ్ లేకపోతే అభివృద్ధికి మరింత అవకాశం ఉండేదన్నారు.

Read Also: Chandrababu: నేడు ఢిల్లీకి చంద్రబాబు.. పొత్తులపై బీజేపీ పెద్దలతో కీలక భేటీ!

కొన్ని పరిమితులు ఉన్నాయని.. బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గత ఐదేళ్ళల్లోనూ వైద్యం, విద్యా, వ్యవసాయం, మహిళా, వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రోడ్ల మరమ్మతులు, మౌలిక సదుపాయాలు కల్పనపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర సానుకూల సంబంధాల ద్వారా పరిష్కర దిశగా తీసుకుని వచ్చామన్నారు. గతంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది.. అయినా చాలా అంశాలు సాధించుకోలేక పోయారన్నారు.

Exit mobile version