NTV Telugu Site icon

Pithapuram Elections Results: పిఠాపురంలో రికార్డు పోలింగ్‌.. పవన్‌ కల్యాణ్‌ మెజార్టీపై ఆసక్తి!

Pawan Kalyan

Pawan Kalyan

All Eyes on Pithapuram Elections Results 2024: ఏపీలో మే 13న జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్‌ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా? అని జనాలు ఆసక్తిగా ఉన్నారు. అయితే జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ గెలుపుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే.. పిఠాపురంలో గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి 86.63 శాతం పోలింగ్‌ నమోదైంది. రాత్రి అయినా కూడా మహిళలు ఓటేసేందుకు పోటెత్తారు. ఈ నేపథ్యంలో జనసేనాని విజయం ఏ రీతిలో ఉంటుందనే చర్చ జరుగుతుంది.

పవన్‌ కళ్యాణ్ కూటమి ఏర్పాటులో ముఖ్య పాత్ర వహించిన విషయం తెలిసిందే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధిక సీట్లలో జనసేన అభ్యర్థులను పోటీలో నిలిపారు. జనసేనాని అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గంలో అయితే అన్ని ప్రాంతాలు తిరుగుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నేనున్నానంటూ జనాలకు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో పవన్‌కు చాలామంది మద్దతు పలికారు. పవన్‌ భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టిస్తారని అందరూ అంటున్నారు. జనసేనాని గెలుపు, మెజార్టీ కొన్నాళ్ల పాటు నిలిచిపోయేలా ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి.

Also Read: Nandamuri Ramakrishna: కనక దుర్గమ్మను దర్శించుకున్న నందమూరి రామకృష్ణ!

2014లో జనసేన పార్టీ స్థాపించిన పవన్‌ కల్యాణ్‌.. పోటీకి మాత్రం దూరంగా ఉన్నాడు. =2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ ఓటమి పాలయ్యారు. ఈసారి కాకినాడ సిట్టింగ్ ఎంపీ, వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పిఠాపురం నుంచి పోటీ చేశారు. 2.35 లక్షల మంది ఓటర్లు ఉన్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పవన్ లక్ష మెజారితో గెలుస్తారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం పవన్ పేరు ట్రెండ్ అవుతోంది.