Pithapuram Elections Results: పిఠాపురంలో రికార్డు పోలింగ్.. పవన్ కల్యాణ్ మెజార్టీపై ఆసక్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
All Eyes on Pithapuram Elections Results 2024: ఏపీలో మే 13న జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా? అని జనాలు ఆసక్తిగా ఉన్నారు. అయితే జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ గెలుపుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే.. పిఠాపురంలో గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి 86.63 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి అయినా కూడా మహిళలు ఓటేసేందుకు పోటెత్తారు. ఈ నేపథ్యంలో జనసేనాని విజయం ఏ రీతిలో ఉంటుందనే చర్చ జరుగుతుంది.
పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటులో ముఖ్య పాత్ర వహించిన విషయం తెలిసిందే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధిక సీట్లలో జనసేన అభ్యర్థులను పోటీలో నిలిపారు. జనసేనాని అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గంలో అయితే అన్ని ప్రాంతాలు తిరుగుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నేనున్నానంటూ జనాలకు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో పవన్‌కు చాలామంది మద్దతు పలికారు. పవన్ భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టిస్తారని అందరూ అంటున్నారు. జనసేనాని గెలుపు, మెజార్టీ కొన్నాళ్ల పాటు నిలిచిపోయేలా ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Also Read
- Jyothula Nehru: ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లడంపై స్పందించిన జ్యోతుల నెహ్రూ.. ఆసక్తికర వ్యాఖ్యలు
- Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
Also Read: Nandamuri Ramakrishna: కనక దుర్గమ్మను దర్శించుకున్న నందమూరి రామకృష్ణ!
2014లో జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్.. పోటీకి మాత్రం దూరంగా ఉన్నాడు. =2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ ఓటమి పాలయ్యారు. ఈసారి కాకినాడ సిట్టింగ్ ఎంపీ, వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పిఠాపురం నుంచి పోటీ చేశారు. 2.35 లక్షల మంది ఓటర్లు ఉన్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పవన్ లక్ష మెజారితో గెలుస్తారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం పవన్ పేరు ట్రెండ్ అవుతోంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!