Fire Accidents: రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం!

Cm Chandrababu

Cm Chandrababu

దీపావళి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. విజయనగరం జిల్లా రాజాంతో పాటు కృష్ణా జిల్లా గన్నవరం, తిరువూరులో జరిగిన అగ్నిప్రమాదాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రాజాంలోని ఓ ఆటోమొబైల్ షోరూమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. దీపావళి టపాసులు ప్రమాదవశాత్తు షోరూమ్‌పై పడటంతో మంటలు చెలరేగి భవనం దగ్ధమైంది. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను చేశారని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో బాణాసంచా కాలుస్తుండగా నిప్పురవ్వలు ఎగిరిపడి ఓ ఫర్నిచర్ దుకాణానికి మంటలు అంటుకున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ఘటనలో ఆస్తినష్టం జరగడంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.

రాజాం, గన్నవరం, తిరువూరులో జరిగిన మూడు అగ్నిప్రమాదాలపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా దీపావళి సమయంలో బాణాసంచా కాల్చే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.