Pawan Kalyan: మహారాష్ట్ర బల్లార్‌పూర్ బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మరాఠీ, హిందీ, తెలుగులలో ఆయన ప్రసంగించారు. తన మరాఠీలో ఏమైనా తప్పులు దొర్లితే క్షమించాలన్నారు. ఈ రెండు రోజుల్లో మరాఠీ బాగానే తెలుసుకున్నానని అన్నారు. శివాజీ మహరాజ్ భూమి ఐన మరాఠా గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తానన్నారు. అయోధ్య రామమందిరం ప్రతీ అంగుళం ఇక్కడి వారు మహత్వపూర్ణం చేశారని పేర్కొన్నారు. 500 సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా రాముడికి తన స్థానం దక్కిందన్నారు. మోదీ, అమిత్ షా, హైవే మేన్ ఆప్ ఇండియా నితిన్ గడ్కరీల ప్రయత్నాల ఫలితం ఇక్కడి రహదారులను చూస్తే తెలుస్తుందన్నారు.
Read Also: Minister Nadendla Manohar: రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా!
ఇక వేయడానికి రోడ్లు లేవనేంతగా రోడ్లు వేసామని చెప్పారన్నారు. నేనిక్కడకి ఓట్లు అడగడానికే రాలేదని.. ఈ నేలకు తన గౌరవం తెలపడానికి వచ్చానన్నారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం మీ అందరి సహకారం కోరడానికి వచ్చానన్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలలో ఐదో స్ధానంలో ఉన్నాం.. మూడో స్ధానానికి చేరుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నామని పేర్కొన్నారు. బాహుబలిలో శివగామి నడక ఆగలేదు మహేంద్ర బాహుబలిని రాజ్యాధికారానికి చేర్చడానికి.. అదే విధంగా ఇక్కడ పది సంవత్సరాల ఎన్డీఏ అధికారం కూడా కొనసాగించాలన్నారు. శివసేన, జనసేన ప్రజల రక్షణ కోసం ఏర్పాటైన సేనలు అని అన్నారు. హిందూ హృదయ సామ్రాట్ బాలా సాహెబ్ ఠాక్రే నడిచిన భూమికి వచ్చే అవకాశం తనకు దక్కిందన్నారు పవన్ కల్యాణ్. ప్రాంతీయాన్ని విస్మరించని జాతీయవాదం జనసేనదంటూ వ్యాఖ్యానించారు. ఇవాళ బాలా సాహెబ్ ఠాక్రే స్మృతిదినం అని తెలిపారు.
Read Also: Tirupati: తిరుపతిలోని శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ పేరు మార్చిన అఫ్కాన్ సంస్థ
స్ధానిక వనరులు, మానవవనరులు కోల్పోకూడదనే తాను తెలంగాణకు కూడా మద్దతిస్తానన్నారు. ప్రాంతీయత బలం ఉండాలి.. జాతీయతా భావాలని చంపకూడదన్నారు. బాలా సాహెబ్ ఠాక్రే లాగా సిద్ధాంతం కోసం నిలబడాలి.. పదవులు, అధికారం వస్తాయా రావా అని కాదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ లేని భారతదేశం ఇంత బలంగా ఉండేదా అనిపిస్తుందన్నారు. “నెల్లూరు దగ్గర తుఫాను సమయంలో నా చిన్నపుడు, RSS కార్యకర్తలు చేసిన శుభ్రతకు హ్యాట్సాఫ్ చెప్పాలనిపించింది. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడానికి NDA కృషి చేస్తోంది. 2028 నాటికి మహారాష్ట్రని ఒక ట్రిలియన్ డాలర్ ఆర్ధిక వ్యవస్థగా ఎన్డీఏ మార్చనుంది. ఏపీలో వైసీపీని కొట్టాం అంటే మామూలుగా కొట్టామా.. ఇక్కడ హ్యాట్రిక్ కొట్టాలి మనం. బాలా సాహెబ్ థాక్రే జాతీయవాదం పెరగాలి, సనాతన ధర్మం రక్షింపబడాలి అని కోరుకున్నారు. మోదీ రాకూడదని ఎందరో కోరుకున్నారు.. మూడోసారి తీసుకొచ్చిన సత్తా ఆంధ్ర నుంచీ వచ్చింది. మహాయుతీ సర్కార్ మహారాష్ట్రలో రావాలి.” అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.