Site icon NTV Telugu

Pawan Kalyan: అలా చూసి చలించిన పవన్ కళ్యాణ్.. ఆ ఆదివాసీ గ్రామస్థులందరికీ చెప్పులు పంపిణీ

Pawan

Pawan

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడు గ్రామస్థులందరికీ చెప్పులు పంపిణీ చేశారు. ఇటీవల “అడవితల్లి బాట” అనే కార్యక్రమంలో భాగంగా పవన్ ఆదివాసీ గ్రామం పెదపాడులో పర్యటించిన విషయం విదితమే. ఆ సమయంలో పాంగి మిథు అనే వృద్ధురాలు పవన్‌కళ్యాణ్‌ కోసం నడిచి వచ్చి స్వాగతం పలికారు. ఆ వృద్ధురాలితో పాటు గ్రామంలోని అనేక మంది మహిళలు చెప్పులు లేకుండా ఉన్నట్లు ఆయన గుర్తించారు. వారిని కనీసం చెప్పులు లేకండా చూసి చలించి పోయారు.

READ MORE: World Liver Day 2025: స్టార్ హాస్పిటల్స్ సమగ్ర లివర్ ఆరోగ్య సేవల ప్రారంభం

గ్రామంలో ఎంత మంది జనాభా నివసిస్తున్నారని స్థానిక అధికారులను అడిగారు. ఆ గ్రామంలో దాదాపు 345 మంది నివసిస్తున్నారని తెలుసుకున్నారు. వెంటనే వారందకీ ఏ సైజు చెప్పులు సరిపోతాయో తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాజాగా గురువారం గ్రామంలోని అందరికీ డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది చెప్పులు పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం నుంచి బహుమతి అందుకున్న తర్వాత గ్రామస్థులు భావోద్వేగానికి గురయ్యారు. డిప్యూటీ సీఎంకు గ్రామస్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “మా పవన్ సర్ వచ్చి మా పోరాటాలను గుర్తించారు. మరే ఇతర నాయకుడు మా సమస్యలను పట్టించుకోలేదు. మా గ్రామాన్ని సైతం ఎవ్వరూ సందర్శించలేదు. మా గ్రామాన్ని సందర్శించి తమ ఇబ్బందులను పరిష్కరించినందుకు ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.” అని ఓ గ్రామస్థుడు భావోద్వేగానికి గురయ్యాడు.

READ MORE: PM Modi Amaravati Tour: ప్రధాని మోడీ ఏపీ పర్యటన.. ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు

Exit mobile version