ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడు గ్రామస్థులందరికీ చెప్పులు పంపిణీ చేశారు. ఇటీవల "అడవితల్లి బాట" అనే కార్యక్రమంలో భాగంగా పవన్ ఆదివాసీ గ్రామం పెదపాడులో పర్యటించిన విషయం విదితమే. ఆ సమయంలో పాంగి మిథు అనే వృద్ధురాలు పవన్‌కళ్యాణ్ కోసం నడిచి వచ్చి స్వాగతం పలికారు.