Pawan Kalyan: అలా చూసి చలించిన పవన్ కళ్యాణ్.. ఆ ఆదివాసీ గ్రామస్థులందరికీ చెప్పులు పంపిణీ
- దాతృత్వాన్ని చాటుకున్న పవన్ కళ్యాణ్
- చెప్పులు లేకపోవడాన్ని గమనించిన పవన్
- వెంటనే గ్రామంలోని జనాభాపై ఆరా
- చెప్పులు సైజుపై సిబ్బందితో సర్వే
- గ్రామస్థులందరికీ చెప్పులు పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడు గ్రామస్థులందరికీ చెప్పులు పంపిణీ చేశారు. ఇటీవల “అడవితల్లి బాట” అనే కార్యక్రమంలో భాగంగా పవన్ ఆదివాసీ గ్రామం పెదపాడులో పర్యటించిన విషయం విదితమే. ఆ సమయంలో పాంగి మిథు అనే వృద్ధురాలు పవన్‌కళ్యాణ్ కోసం నడిచి వచ్చి స్వాగతం పలికారు. ఆ వృద్ధురాలితో పాటు గ్రామంలోని అనేక మంది మహిళలు చెప్పులు లేకుండా ఉన్నట్లు ఆయన గుర్తించారు. వారిని కనీసం చెప్పులు లేకండా చూసి చలించి పోయారు.
READ MORE: World Liver Day 2025: స్టార్ హాస్పిటల్స్ సమగ్ర లివర్ ఆరోగ్య సేవల ప్రారంభం
Also Read
- UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
- India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్‌పై భారత్ చారిత్రక విజయం
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
గ్రామంలో ఎంత మంది జనాభా నివసిస్తున్నారని స్థానిక అధికారులను అడిగారు. ఆ గ్రామంలో దాదాపు 345 మంది నివసిస్తున్నారని తెలుసుకున్నారు. వెంటనే వారందకీ ఏ సైజు చెప్పులు సరిపోతాయో తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాజాగా గురువారం గ్రామంలోని అందరికీ డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది చెప్పులు పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం నుంచి బహుమతి అందుకున్న తర్వాత గ్రామస్థులు భావోద్వేగానికి గురయ్యారు. డిప్యూటీ సీఎంకు గ్రామస్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “మా పవన్ సర్ వచ్చి మా పోరాటాలను గుర్తించారు. మరే ఇతర నాయకుడు మా సమస్యలను పట్టించుకోలేదు. మా గ్రామాన్ని సైతం ఎవ్వరూ సందర్శించలేదు. మా గ్రామాన్ని సందర్శించి తమ ఇబ్బందులను పరిష్కరించినందుకు ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.” అని ఓ గ్రామస్థుడు భావోద్వేగానికి గురయ్యాడు.
READ MORE: PM Modi Amaravati Tour: ప్రధాని మోడీ ఏపీ పర్యటన.. ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు
తాజావార్తలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
-
India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్‌పై భారత్ చారిత్రక విజయం
-
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
-
Jason Sanjay: దళపతి ప్లేస్‌ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!