Narayana Swamy: పురంధరేశ్వరి ఏ పార్టీయో..? అర్థం కావడం లేదు.. లిక్కర్ పాలసీపై సీబీఐ విచారణకు రెడీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narayana Swamy: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై సెటైర్లు వేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. పురంధరేశ్వరిలో తన మరిది చంద్రబాబును కాపాడుకునే తపన తప్ప వేరే కనపడటం లేదని దుయ్యబట్టారు.. ఎన్టీఆర్ కూతురు అని చెప్పుకునే అర్హత ఈమెకు లేదని ఫైర్ అయ్యారు. ఇక, పురంధరేశ్వరి ఏ పార్టీ యో.. నాకు అర్థం కావడం లేదని సెటైర్లు వేసిన ఆయన.. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీయే చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడితే.. ఈమె చంద్రబాబును వెనకేసుకు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్యం పాలసీపై కీలక వ్యాఖ్యలు చేశారు నారాయణ స్వామి.. లిక్కర్ పాలసీ పై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతున్నారు.. మద్యపానం పెడితే తప్పా.. అంటూ ఆనాడు కొన్ని పత్రికలు రాశాయని దుయ్యబట్టారు. మద్యపానం నిర్మూలించినది ఎన్టీఆరే.. కానీ, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పదవి లాక్కొని, ఆయన ఆశయాలకు తూట్లు పొడిచారని విమర్శించారు. 1998లో మద్యపాననిషేధం ఎత్తివేయక పోతే ప్రభుత్వం నడపలేమని చంద్రబాబు ప్రకటించి ఎత్తివేశారని గుర్తు చేశారు. ఇక, గుడి బడి అని చూడకుండా 4378 ప్రవేట్ వైన్ షాప్ లు, 43 వేల బెల్ట్ షాప్ లు పెట్టారని మండిపడ్డారు. ప్రెసిడెంట్ మోడల్, డీలక్స్ విస్కీ, గవర్నర్ విస్కీ, బూమ్ బూమ్ బీర్‌కు 2017లో చంద్రబాబు పాలనలో అనుమతి ఇచ్చారని తెలిపారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
మరోవైపు.. యనమల రామకృష్ణుడు బంధువులు, అయ్యన్న పాత్రుడు, డీకే ఆదికేశవులు నాయుడు, నంద్యాల ఎస్పీవై రెడ్డిలకు టీడీపీ నేతలకు చెందిన వారికే డిస్టిలరిలకు అనుమతి ఇచ్చింది చంద్రబాబు పాలనలోనే అన్నారు నారాయణ స్వామి.. సీబీఐ విచారణ వద్దని చంద్రబాబు నాయుడు వెనకడుగు వేశారని తెలిపారు. ఎన్టీఆర్ బొమ్మ లేకుండా గెలిచే దమ్ము చంద్రబాబుకు ఉందా..? అని సవాల్ చేశారు.. లోకేష్, పవన్ కల్యాణ్ ఫొటో పెట్టుకుని చంద్రబాబు ఒక్క సీటు అయినా గెలుస్తాడా..? అలా గెలుస్తే నేను రాజకీయాలు వదిలేస్తాను అంటూ చాలెంజ్ విసిరారు.. 2014 నుంచి ఎక్సైజ్ పాలసీపై సీబీఐ విచారణకు మేం సిద్ధం.. మేం ఎప్పుడూ భయపడం అని సవాల్ విసిరారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!