NTV Telugu Site icon

Kottu Satyanarayana: మా వాడు వారాహి యాత్రలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.. పవన్‌పై మంత్రి సెటైర్లు

Kottu Satyanarayana

Kottu Satyanarayana

Kottu Satyanarayana: మా వాడు చేస్తున్న వారాహి యాత్రలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్‌పై మరోసారి సీరియస్‌ కామెంట్లు చేశారు.. సీఎం వైఎస్‌ జగన్‌కు రోజు రోజుకూ ప్రజాభిమానం పెరుగుతోందన్న ఆయన.. జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణను ప్రతిపక్ష పార్టీలు ఓర్చుకోలేకపోతున్నాయని ఫైర్‌ అయ్యారు.. జగన్ రహిత పరిపాలన రావాలని పదే పదే చెబుతున్నారు. జగన్ రహిత పాలన జరిగితే చంద్రబాబుకు.. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకే లాభం దక్కుతుంది.. చంద్రబాబు రహిత రాజకీయాలుంటేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు.

Read Also: Bank Holidays: వచ్చే నెలలో ఈ రోజుల్లో బ్యాంకులకు వెళ్లకండి

నాలుగు దశాబ్దాలుగా ఏపీని పట్టి పీడిస్తున్న శనిగాడు చంద్రబాబు అంటూ ఫైర్‌ అయ్యారు డిప్యూటీ సీఎం కొట్టు.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాలనలో లక్ష్మీ దేవి నెల నెల ప్రతి ఇంటి తలుపులు తడుతోందన్న ఆయన.. మా వాడు చేస్తున్న వారాహి యాత్రలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.. చంద్రబాబు ఏం చెబితే పవన్ అదే చెబుతున్నాడు అని ఎద్దేవా చేశారు.. భగవంతుడు సాక్షిగా సీఎం పదవిని అంగీకరిస్తున్నాని పవన్ అనేవి తింగరి మాటలన్న ఆయన.. కాపులు లేస్తే మామూలోళ్లు కాదని.. కాపులతో పెట్టుకోవద్దని అంతా అంటారనే సామెత ఉంది. పవన్ చర్యలు.. కామెంట్లు కాపుల ఉనికి, పరువు కొల్పోయేలా తింగరి మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.. కాపు సామాజిక పెద్దలు పవన్ కామెంట్లతో బాధ పడుతున్నారు. పవన్ కామెంట్లతో బాధపడి ముద్రగడ పవన్‌కు లేఖ రాశారు. కాపు సామాజిక వర్గం నేతగా ముద్రగడని ప్రజలు గౌరవిస్తారు.. అలాంటి వ్యక్తి పవన్‌ను విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. ఇక, చంద్రబాబు చేసే మారణ హోమంలో పవన్ బలి అవుతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. పవన్‌ను చంపడానికి సుపారీ ఇవ్వడమేంటీ..? జగన్‌కు పవన్‌ నేరుగా ప్రత్యర్థి కాదు. పవన్ గురించి ఆలోచించే సమయం కూడా జగన్‌కు లేదు.. పవన్‌కు అపాయం జరిగితే సానుభూతి చంద్రబాబుకే వస్తుంది.. మాకేం అవసరం. చంద్రబాబు నుంచే పవన్‌కు పెను ప్రమాదం పొంచి ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.