Bank Holidays: జూలై 2023లో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలతో సహా దేశవ్యాప్తంగా బ్యాంకులు దాదాపు 15 రోజుల పాటు మూసివేయబడతాయి. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రతి నెల మొదటి, మూడవ శనివారం తెరిచి ఉంటాయి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం అన్ని ప్రభుత్వ సెలవు దినాలలో బ్యాంకులు మూసివేయబడతాయి. కొన్ని ప్రాంతీయ సెలవులు రాష్ట్రాల వారీగా ఉంటాయి. ప్రాంతీయ సెలవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆదివారం బ్యాంకులు మూసివేయడాన్ని తప్పనిసరి చేసింది.
జూలైలో మొత్తం 15 సెలవులు
జూలై నెలలో శని, ఆదివారాలు మినహా ఎనిమిది సెలవులు ఉన్నాయి. ఇది గురు హరగోవింద్ జీ పుట్టినరోజు అయిన జూలై 5 నుండి ప్రారంభమై.. మొహర్రం సెలవుదినం జూలై 29న ముగుస్తుంది. కొన్ని రాష్ట్రాలు మినహా భారతదేశంలోని అన్ని బ్యాంకులకు ఈ సెలవులు వర్తిస్తాయి. మరోవైపు శనివారం, ఆదివారాల కారణంగా మరో 7సెలవులు వస్తున్నాయి. వీటిలో 5 ఆదివారాలు, రెండు శనివారాలు. జూలై నెలలో మొత్తం 15 సెలవులు ఉన్నాయి. ఎవరైనా బ్యాంకులో చాలా ముఖ్యమైన పనిని కలిగి ఉంటే, బ్యాంకుల సెలవు రోజులను గుర్తుపెట్టుకుని వెళ్లాలి. అయితే, ఎటిఎంలు, నగదు డిపాజిట్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యథావిధిగా పనిచేస్తాయి.
Read Also:Anganwadi Centers: రంగు పడుద్ది.. ఆ గుడ్లపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక ముద్ర
2000 రూపాయల నోట్లు డిపాజిట్
మరోవైపు దేశంలోని అన్ని బ్యాంకుల్లో రూ.2000 నోట్ల డిపాజిట్లు జరుగుతున్నాయి. మే నెలలో రూ.2000 నోట్లను ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ ఆదేశించింది. సెప్టెంబర్ నెలాఖరులోగా ఈ 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయాలని దేశ ప్రజలకు తెలియజేసింది. దీనిపై నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జులైలో ఎవరికైనా రూ.2000 నోట్లు వచ్చి బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి వస్తే అలాంటి వారు బ్యాంకు సెలవుల ప్రకారం సర్దుకుపోవాల్సి వస్తుంది.
బ్యాంకు సెలవు జాబితా
2 జూలై 2023: ఆదివారం
5 జూలై 2023: గురు హరగోవింద్ సింగ్ జయంతి (జమ్ము, శ్రీనగర్)
6 జూలై 2023: MHIP డే (మిజోరం)
8 జూలై 2023: రెండవ శనివారం
9 జూలై 2023: ఆదివారం
11 జూలై 2023: కేర్ పూజ (త్రిపుర)
13 జూలై 2023: భాను జయంతి (సిక్కిం)
16 జూలై 2023: ఆదివారం
17 జూలై 2023: యు టిరోట్ సింగ్ డే (మేఘాలయ)
21 జూలై 2023: ద్రుక్పా త్సే-జీ (గ్యాంగ్‌టక్)
22 జూలై 2023: నాల్గవ శనివారం
23 జూలై 2023: ఆదివారం
29 జూలై 2023: ముహర్రం (దాదాపు అన్ని రాష్ట్రాల్లో)
30 జూలై 2023: ఆదివారం
31 జూలై 2023: అమరవీరుల దినోత్సవం (హర్యానా, పంజాబ్)
Read Also:Dwarampudi Chandrasekhar Reddy: పవన్ నా మీద పోటీ చేస్తాడనుకుంటే.. తోక ముడుచుకొని వెళ్లిపోతున్నాడు