NTV Telugu Site icon

Andhra Pradesh: కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ సమీక్ష

Cs Neerabh

Cs Neerabh

Andhra Pradesh: రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, హోం, నైపుణ్యాభివృద్ధి, సాంఘిక, బీసీ, గిరిజన మహిళా శిశు సంక్షేమం విభిన్న ప్రతిభా వంతుల శాఖలతో పాటు, గృహ నిర్మాణ, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరును, ఆయా పథకాల ప్రగతిని సీఎస్ సమీక్షించారు. ముందుగా పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన వివిధ కేంద్ర ప్రాయోజిక పథకాలపై సీఎస్ సమీక్షించగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. పీఆర్ అండ్ ఆర్డీ శాఖలో మొత్తం 22 కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేయడం జరుగుతోందని వివరించారు. 2023-24లో వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 13వేల 366 కోట్ల రూపాయలను, 2024-2025లో ఇప్పటి వరకూ 7వేల 899 కోట్ల రూపాయలను  ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. 2024-2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాయోజిత పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వ వాటాగా 8వేల 340 కోట్ల రూపాయలను విడుదల చేసిందని చెప్పారు. పంచాయితీ రాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖలో వివిధ కేంద్ర ప్రాయోజిత పధకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నట్టు శశిభూషణ్ కుమార్ సీఎస్‌కు వివరించారు.

Read Also: P. Chidambaram: రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ వెనకాడదు..

అనంతరం నైపుణ్య శిక్షణ విభాగానికి సంబంధించిన కార్యక్రమాలపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షిస్తూ.. 2023-24, 2024-25లో ఇప్పటి వరకూ నిర్వహించిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందుకు కేంద్ర ప్రభుత్వం వాటా,అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన నిధులపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ శిక్షణా కార్యక్రమాల్లో కవర్ చేయని కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని కూడా రాష్ట్రంలో అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా నైపుణ్య శిక్షణ విభాగం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఔట్ కమ్ బేస్డ్ మెరుగైన శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు.ఇప్పటి వరకూ నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి సవివరమైన నివేదికను సమర్పించాలని సీఎస్ ఆదేశించారు.
Read Also:

Perni Nani: బెదిరింపులకు బెదిరేది లేదు.. జనసైనికుల ఆందోళనపై స్పందించిన పేర్ని నాని

తదుపరి హోం శాఖకు సంబంధించిన కేంద్ర ప్రాయోజిత పధకాలను సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్ హోం శాఖకు సంబంధించి పోలీస్ బలగాల ఆధునీకరణ వంటి 3 కేంద్ర ప్రాయోజిత పధకాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సీసీ కెమెరాలను రాష్ట్ర సచివాలయంలోనే రియల్ టైమ్ గవర్నెస్ వ్యవస్థతో అనుసంధానించాలని సీఎస్ చెప్పారు. అనంతరం సాంఘిక, బీసీ, గిరిజన మహిళా, విభిన్న ప్రతిభావంతుల శాఖలతో పాటు, గృహ నిర్మాణం, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించిన కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల అమలు ప్రగతిని ఆయా శాఖల అధికారులతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి, పోలీస్ శాఖ ఐజీ పీహెచ్డీ రామకృష్ణ, ఇంకా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.