CS Jawahar Reddy Review: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యాబోధనపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు.
Also Read: PM Modi: గ్రామాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు ముఖ్యం
కృత్రిమ మేధస్సు ద్వారా విద్యాబోధనకు కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో పూర్తి స్థాయిలో కెపాసిటీ బిల్డింగ్ చేయాలన్నారు. దీని కోసం టెక్నికల్ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. దీనికి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సీఎస్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మొబైల్ యాప్‌ల నుంచి ఆన్‌లైన్ కోర్సుల వరకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతోందని ఆయన అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కృత్రిమ మేధస్సు గురించి అవగాహన పెంచాలని అధికారులకు సీఎస్ సూచనలు చేశారు.