NTV Telugu Site icon

AP CM Jagan: ఎమ్మెల్యే గిరిధర్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి జగన్‌

Ap Cm Jagan

Ap Cm Jagan

AP CM Jagan: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పరామర్శించారు. కాగా వైసీపీ ఎమ్మెల్యే గిరిధర్‌ తల్లి శివపార్వతి(68) గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. శ్యామలానగర్‌లో గుంటూరు వెస్ట్‌ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Read Also: Rain Alert: ఏపీకి చల్లని కబురు.. ఈ ప్రాంతాలకు వర్షసూచన!

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ మాతృమూర్తి శివపార్వతి సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయానికి మంత్రులు మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.