CM YS Jagan: లండన్ చేరుకున్న సీఎం జగన్.. నినాదాలు చేసిన అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగియడంతో.. విదేశీ పర్యటనకు వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ (గన్నవరం ఎయిర్పోర్ట్) నుంచి బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి బయలుదేరిన సీఎం జగన్.. ఇవాళ మధ్యాహ్నం లండన్ చేరుకున్నారు. జగన్ లండన్ విమానాశ్రయంలో దిగగానే.. అక్కడ కూడా జై జగన్ అంటూ నినాదాలు మారుమోగాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ దిగి కారు ఎక్కుతుండగా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. చిరునవ్వుతో జగన్ ఎయిర్‌పోర్టులో ఉల్లాసంగా కనిపించారు. ఈ నెల 31వ తేదీ తిరిగి బెజవాడ చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.. అయితే, సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో ఎయిర్ పోర్ట్‌లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Fake Notes : తొమ్మిదో తరగతి ఫెయిల్.. యూట్యూబ్‌లో చూసి.. నకిలీ నోట్లు ముద్రించి..
Also Read
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్‌కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన డాక్టర్ తుళ్లూరు లోకేష్ గా గుర్తించారు.. లోకేష్ కి అమెరికన్ సిటీజన్ షిప్ ఉన్నట్టు కూడా నిర్ధారణకు వచ్చారు పోలీసులు.. అయితే, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి విదేశీ పర్యటనకు సంబంధించిన కొన్ని మెసేజ్ లు ముందుగానే లోకేష్ పెట్టినట్టు గుర్తించారు.. సీఎం జగన్ వెళ్లే సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో లోకేష్ కనపడటంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. అయితే, పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో గుండె పోటు వచ్చిందని లోకేష్ చెప్పినట్టుగా తెలుస్తుండగా.. ఆ వెంటనే లోకేష్‌ను ఆస్పత్రిలో చేర్చారు పోలీసులు.. అయితే, సీఎం జగన్ విదేశీ పర్యటనకు లోకేష్‌కి సంబంధం ఏంటి? ఆ సమయంలో ఎందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు..? లోకేష్.. సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన మెసేజ్‌లను ఎవరికి పెట్టాడు..? తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నాలు ఉన్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
-
Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
-
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్‌లో ఇద్దరు దిగ్గజాలు!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!