AP CM Jaganmohan Reddy: సీఎం జగన్‌ రెండు రోజుల వైఎస్సార్‌ కడప జిల్లా పర్యటన ఖరారు

Cm Jagan

Cm Jagan

AP CM YS Jaganmohan Reddy: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రెండు రోజుల వైఎస్సార్‌ కడప జిల్లా పర్యటన ఖరారైంది. డిసెంబర్‌ 2, 3 తేదీల్లో లింగాల, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు వెల్లడించారు. ముఖ్యమంత్రి డిసెంబర్‌ 2, 3 తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఇలా..

  • డిసెంబర్‌ 2న ఉదయం సీఎం వైఎస్‌ జగన్‌ తన నివాసం నుంచి 10.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
  • 11.30 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని సీబీఆర్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకుంటారు.
  • మధ్యాహ్నం 12.00 గంటలకు అక్కడ బోటింగ్‌ జెట్టిని ప్రారంభిస్తారు.
  • 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్‌ వైఎస్సార్‌ లేక్‌ వ్యూ పాయింట్‌కు బయలుదేరుతారు.
  • 12.40 గంటలకు అక్కడికి చేరుకుని వైఎస్సార్‌ లేక్‌ వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు.
  • 1.30 నుంచి 4.30 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు.
  • 4.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.00 గంటలకు హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌ చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు.
  • డిసెంబర్‌ 3న ఉదయం 8.30 గంటలకు వైఎస్సార్‌ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 8.35 గంటలకు అక్కడ ఉన్న హెలిప్యాడ్‌ నుంచి పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
  • అక్కడి నుంచి 9.00 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి కదిరిరోడ్డులోని ఎస్‌సీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌కు చేరుకుంటారు.
  • అక్కడ 9.15 నుంచి 9.30 గంటల వరకు సీఎం వ్యక్తిగత కార్యదర్శి డి.రవిశేఖర్‌ కుమార్తె వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు.
  • 9.45 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10.10 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
  • 10.15 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 11.30 గంటలకు తమ నివాసానికి చేరుకుంటారు.