CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.. పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు విశాఖపట్నంలో ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇక, ఈ రెండు జిల్లా టూర్ కోసం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి.. భీమవరం చేరుకుంటారు సీఎం జగన్.. పెదఅమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ కు చేరుకుని.. వైసీపీ నాయకులు గుణ్ణం నరసింహానాగేంద్రరావు కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడి నుంచి విశాఖపట్నం చేరుకోనున్న ఏపీ సీఎం.. ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే పార్టీ నేత, డీసీసీబీ చైర్మన్ కోలా గురువులు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు.. నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.. దీంతో.. సీఎం జగన్.. రెండు జిల్లాల పర్యటన ముగియనుంది.. అనంతరం విశాఖపట్నం నుంచి సాయంత్రం తాడేపల్లికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
Read Also: CM Revanth Reddy: సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
కాగా, ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఓవైపు.. ప్రభుత్వ కార్యక్రమాలు, మరోవైపు పార్టీ మీటింగ్‌లు, సభలు, సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు సీఎం జగన్.. వైనాట్ 175 అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతోన్న ఆయన.. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్న విషయం విదితమే. ఇక, నిన్న వైసీపీ కీలక సమావేశం జరగగా.. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విరామం లేకుండా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.