CM YS Jagan: క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్..
CM YS Jagan: సఫాయి కార్మికుల కోసం క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. స్వచ్ఛత ఉద్యమి యోజన కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా లబ్దిదారులకు 100 మురుగుశుద్ధి వాహనాల అందజేశారు.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సఫాయి కార్మికులు వినియోగించే క్లీనింగ్ యంత్రాలను జెండా ఊపి ప్రారంభించారు ఏపీ సీఎం.. ఇక, ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read
- Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
- GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..
- MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
మొత్తంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. మురుగు నీరు, చెత్త నిర్మూలన వాహనాను అందుబాటులోకి తెచ్చింది.. సఫాయి కర్మచారీల కోసం 100 మురుగు శుద్ధి వాహనాలను ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.. జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన ఆయన.. పారిశుద్ధ్య కార్మికులకు వాహనులకు సంబంధించిన కీలను అందజేశారు.. మరోఎవైపు, రేపు నంద్యాల, కడప జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. నంద్యాల జిల్లాలో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో పాల్గొననున్న ఆయన.. సాయంత్రానికి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.



తాజావార్తలు
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
-
GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
-
Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో