Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Cm Ys Jagan At Varikapudisela Project

CM YS Jagan: మీతోనే పొత్తు.. మీరే నా ధైర్యం.. మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా చూడండి..

Published Date :November 15, 2023 , 2:06 pm
By Sudhakar Ravula
CM YS Jagan: మీతోనే పొత్తు.. మీరే నా ధైర్యం.. మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా చూడండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పొత్తులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మీతోనే పొత్తు.. మీరే నా ధైర్యం.. మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా చూడండి అంటూ పిలుపునిచ్చారు.. పొత్తులను నమ్ముకోలేదు.. నా ధైర్యం మీరే అన్నారు.. పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌.. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.. పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని ప్రకటించారు.. ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ప్రాజెక్టు చేపట్టారు.. ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశాం.. ఏదైనా పని చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలని పేర్కొన్నారు.

పల్నాడులో తాగు, సాగు నీటి ఏడ్డడి ఉన్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. కృష్ణమ్మ పక్కనే ప్రవహిస్తున్నా గుక్కెడు నీళ్లు దొరకడం లేదు అన్నారు సీఎం జగన్‌.. పల్నాడు తల రాత మార్చాలని చేస్తున్న ప్రయత్నమే వరికిపూడిసెల ప్రాజెక్ట్ నిర్మాణం అని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా ఎన్నికలు కు ఒక నెల ముందు టెంకాయ కొట్టారు.. ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుందని నిస్సిగ్గుగా పల్నాడు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.. వైల్డ్ లైఫ్ , ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు ఈ ప్రభుత్వం లో వచ్చాయి.. ఏ అనుమతులు లేకుండా చంద్రబాబు ఎలా ప్రారంభం చేశారు..? అని నిలదీశారు.. చిత్త శుద్ది, నిజాయితీ లేకుండా ప్రజలను మోసం చేసిన నాయకుడు చంద్రబాబు.. అందుకే 2019 లో ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు.. కేవలం 23 స్థానాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా వేల ఎకరాల సాగు, వేలాది మందికి తాగు నీరు అందిస్తాం.. దశల వారీగా మాచర్ల, వినుకొండ, ఎర్ర గొండ పాలెం ప్రాంతాలకు నీరు అందిస్తాం అన్నారు. లక్షా ఇరవై ఐదు వేల ఎకరాలు సాగులోకి వస్తుంది.. లక్ష మందికి తాగు నీరు అందిస్తాం.. పౌరుషాల గడ్డను అభివృద్ధికి అడ్డాగా మార్చాం.. పల్నాడును ప్రత్యేక జిల్లా చేశాం, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం అని వెల్లడించారు.

సామాజిక ఆర్థిక, విద్యా వ్యవస్థల అభివృద్ధికి పని చేస్తున్నాం.. లంచాలు, వివక్ష లేకుండా రెండు లక్షల నలభై వేల కోట్లు ప్రజల అకౌంట్ లలో వేశామని తెలిపారు సీఎం జగన్.. రెండు సంవత్సరాలు వరుసగా కోవిడ్ దాడి చేసినా ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపలేదన్న ఆయన.. గతం లో చంద్రబాబు పాలన లో మోసాలు, వెన్నుపోటు, అసత్యాలు కనిపించే పరిస్థితి.. పద్నాలుగేళ్ళ సీఎం ఒక్క మంచి పని చేశానని ఓటు అడగ లేడు.. మాయ మాటలతో ఓట్లు అడుగుతాడు. మీ బిడ్డగా అడుగుతున్నా మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు వేయండి.. చంద్రబాబు మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ఓటు అడుగుతున్నాడు.. అవసరం అయితే కేజీ బంగారం, బెంజ్ కారు కూడా ఇస్తానంతాడు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

సొంత నియోజకర్గం కుప్పంలో తాగు నీరు ఇవ్వలేని చంద్రబాబు, మన పల్నాడు కు మంచి చేస్తాడా? అని నిలదీశారు జగన్.. కన్నతల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మ కు బంగారు గాజులు చేపిస్తా అన్నట్లు ఉంది చంద్రబాబు ప్రచారమన్న ఆయన.. కుప్పంకు నీళ్లు కావాలన్న, రెవెన్యూ డివిజన్ కావాలన్న చేసింది మీ బిడ్డ జగనేనని స్పష్టం చేశారు. చంద్రబాబు నేను లేస్తే మనిషిని కాను అనే రకం.. ఇప్పుడు ఏం చేస్తానో చెప్పడు, యాభై ఏళ్ల తర్వాత చరిత్ర చెప్తాడు.. ప్రజల చేవిలో ఫ్లవర్ పెడతాడు.. పల్నాడులో గాని ఏ జిల్లా లో గాని అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వమే అన్నారు. పిల్లను ఇచ్చిన మామకు వెన్ను పోటు పొడిచిన చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల కు వెన్ను పోటు పొడవడం లెక్క కాదన్న ఆయన.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాల అంటాడు, బీసీల తోకలు కట్టిరిస్తా అని అహంకార మాటలు చంద్రబాబువి అని మండిపడ్డారు. అసలు చంద్రబాబు మంచి చేసిన పేద కుటుంబాలు ఎవరు చెప్పాలి.. తన కొడుకు, తన మనవడు మాత్రం ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంటారు.. పేద కుటుంబాల పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవ కూడదు అంటారని దుయ్యబట్టారు.

ఇలాంటి చంద్రబాబు హయాం లో ఏ పేద కుటుంబానికి, ఏ వెనుక బడిన వర్గాలకు మేలు జరుగుతుందో ప్రజలు ఆలోచించాలి.. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు ప్రజలను మోసం చేశాడని తెలిపారు సీఎం జగన్.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలోనే రెండు లక్షల ఏడు వేలు ఉద్యోగాలు ఇచ్చాం.. చంద్రబాబు కు మళ్ళీ అధికారం ఇచ్చి ఉంటే ఆర్టీసీ , పవర్ డిస్కం లు అమ్మేసేవాడు.. చంద్రబాబు హయాంలో వైద్య రంగం కుదేలు అయిపోయింది.. రైతులకు ఉచిత విద్యుత్ అడిగితే ఆ రైతులను కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబు ది.. రైతులను మోసం చేసి గాలికి వడిలిన చంద్రబాబు ఇప్పుడు ఏదో చేస్తాడట.. అధికారం లోకి రావాలని కల్ల బొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు.. నరమాంసం అలవాటు పడిన పులి బంగారు గాజులు ఎర వేస్తున్నాడు.. నమ్మి వెళ్తే అంతే సంగతులు అని హెచ్చరించారు సీఎం వైఎస్‌ జగన్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • chandrababu
  • CM YS Jagan
  • tdp
  • Varikapudisela Project

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions