AP CM Jagan: రేపు 146 కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించనున్న సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Jagan: ప్రజల ఆరోగ్యం కోసం ఏపీ సర్కారు పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. సోమవారం 146 కొత్త అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర జెండా ఊపి సీఎం ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం దగ్గర కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికోసం అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. కొత్త అంబులెన్స్‌ల కోసం ప్రభుత్వం రూ. 34.79 కోట్లు ఖర్చు చేసింది. 108 సేవల కోసం ఏటా ప్రభుత్వం వెచ్చిస్తున్న వ్యయం రూ.188.56 కోట్లుగా ఉంది.
Also Read: Telangana Jana Garjana: ఖమ్మంలో కాంగ్రెస్ ‘తెలంగాణ జన గర్జన’ హైలెట్స్ ఇవే..
Also Read
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ కసరత్తు.. అభ్యర్థుల ఖరారుపై మాజీ సీఎం జగన్ కీలక సూచనలు..
- Sheetalnath Temple: కాశ్మీర్లో 36 ఏళ్ల తర్వాత తెరుచుకున్న శీతల్నాథ్ ఆలయం..
- Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
వారికి ఆ అర్హత లేదు: విడదల రజిని
ఇదిలా ఉండగా.. ఆరోగ్యశ్రీపై మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్‌కు లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎవరి హయాంలో ఆరోగ్యశ్రీ ఎలా అమలైందో చర్చకు సిద్ధమా? దమ్ముంటే ఆరోగ్యశ్రీపై చంద్రబాబు, లోకేష్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ‘‘గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు. ఆరోగ్యశ్రీని వెంటిలేటర్‌పై ఉంచారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన వారి పేరైనా లోకేష్ చెప్పగలరా?. 3257 ప్రొసీజర్స్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత సీఎం జగన్‌ది’’ అని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వంలో ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేదు. మా హయాంలో ఈ ఒక్క ఏడాదిలోనే 3,400 కోట్లు ఖర్చుపెట్టాం. నాలుగేళ్లలో 10,100 కోట్లు ఖర్చుపెట్టాం. వార్షికాదాయం 5 లక్షలు ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నాం. మా హయాంలో 2275 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందుతుంది’’ అని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Stock Market Crash: 1200 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. భారీ పతనానికి 3 ప్రధాన కారణాలు ఇవే!
-
Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ కసరత్తు.. అభ్యర్థుల ఖరారుపై మాజీ సీఎం జగన్ కీలక సూచనలు..
-
Sheetalnath Temple: కాశ్మీర్లో 36 ఏళ్ల తర్వాత తెరుచుకున్న శీతల్నాథ్ ఆలయం..
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!