CM Chandrababu: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని సీఎం చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, తదితరులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. అంతకు ముందు శ్రీశైలంలోని పాతాళ గంగలో సీ ప్లేన్ డెమో లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. పౌరవిమానయాన శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, ఎఫ్‌ఐసీసీఐ భాగస్వాములుగా ఉన్నారు.
Read Also: CM Chandrababu on seaplane: సీ ప్లేన్, బోట్లు, రోడ్డు రవాణా లింక్ చేయాలి.. అధికారులతో సీఎం..
విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.. మరికొందరు ప్రజాప్రతినిధులు.. అధికారులతో కలిసి సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లారు.. అయితే, సీప్లేన్ పై అధికారులు, ప్రజా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు సీఎం చంద్రబాబు.. రాబోయే రోజుల్లో రెండు, మూడు విమానాలు వచ్చే అవకాశం ఉందన్నారు.. పచ్చదనం, జలాల మధ్య శ్రీశైలంలో సీ ప్లేన్ చాలా అందంగా ఉందన్న ఆయన.. భారత్ లో మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాం అన్నారు.. అయితే, సీ ప్లేన్, బోట్లు, రోడ్డు రవాణాను లింక్ చేస్తేబాగుంటుందన్నారు సీఎం చంద్రబాబు.. శ్రీశైలంలో ఎంత భూమి అందుబాటులో ఉందని వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.. అయితే, 5 వేల ఎకరాలు ఉందని సమాధానం చెప్పారు అధికారులు.. పాతాళ గంగ మట్టి రోడ్డు వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.. ఇక, విజయవాడ నుంచి సీ ప్లేన్‌లో శ్రీశైలం చేరుకున్న ఆయన.. రోప్ వేలో పాతాళ గంగ నుంచి శ్రీశైలం చేరుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం చంద్రబాబుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీశైల మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.