NTV Telugu Site icon

CM Chandrababu: విశాఖ-విజయనగరం కలిసిపోతాయి.. జూన్ 2026కి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తి..

Babu

Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్టుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఒకటి.. అయితే, జూన్ 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ పనులు పూర్తికానున్నట్టు వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. భోగాపురం చేరుకున్న సీఏం చంద్రబాబుకు మంత్రులు అధికారులు.. పార్టీ ముఖ్య నాయకులు, అధికారులు స్వాగతం పలికారు.. ఆ తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయ పనులను పరిశీలించారు చంద్రబాబు.. అనంతరం రాష్ట్రంలో ఎయిర్ పోర్ట్ పై సెంట్రల్ ఏవియేషన్ అధికారులతో సమీక్ష చేశారు.. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ ఉంటుండగానే కాకినాడ, అమలాపురంలో ఎయిర్ పోర్ట్ లకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.. ఇక, భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తి కావటానికి ఎంత సమయం పడుతుందని జీఎంఆర్ ప్రతినిధులను అడిగారు చంద్రబాబు.. దానికి సమాధానంగా 2026 జూన్‌ నాటికి పూర్తి చేయనున్నట్టు తెలిపారు జీఎంఆర్‌ ప్రతినిధులు.. అలాగే మౌలిక సదుపాయాల వాటర్, పవర్ అందించే విషమై చొరవ చూపాలని సీఎం చంద్రబాబును కోరారు జీఎంఆర్ ప్రతినిధులు..

Read Also: Lung cancer: భారత్ లో వేగంగా విస్తరిస్తున్న ఊపిరితిత్తుల క్యాన్సర్.. కారణం ఇదే…

ఇక, అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం భోగాపురం ఎయిర్ పోర్ట్.. ఇది గ్రోత్ ఇంజన్ గా పనిచేస్తుందని తెలిపారు.. రానున్న రోజుల్లో విశాఖపట్నం – విజయనగం కలిసిపోతాయన్నారు.. ఫేజ్ వన్ లో బీచ్ రోడ్, ఫేజ్ త్రీలో శ్రీకాకుళం రోడ్.. 5 వేల ఎకరాలు తీసుకోడం జరిగింది.. ఎయిర్ పోర్ట్ పనులు చూస్తే 38 శాతం పూర్తి చేశారని తెలిపారు.. ఈ ఎయిర్‌పోర్ట్‌ నుంచి 45 మిలియన్ పాసింజర్ ట్రావెల్ చేస్తారు.. అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, పారిశ్రామికంగా ఎదడగానికి భోగాపురానికి మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే, కొంత హైవేల వద్ద కనెక్టివిటీ సమస్య ఉందని గుర్తించాం.. అలాగే స్టేట్ హైవేలో కూడా సమస్యలు ఉన్నాయి.. వీటిని కూడా పరిష్కరించేలా ముందుకు వెళ్తాం అన్నారు. నా తొలి పర్యాటక ఉత్తరాంధ్ర పెట్టుకున్నా.. అన్నివిధాలా అభివృద్ధి చేసి విశాఖ రుణం తీర్చుకుంటాం అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. నాపై ప్రజలకు.. ప్రజలపై నాకు నమ్మకం ఉంది.. మాకు పవన్‌ కల్యాణ్, బీజేపీ తోడయ్యారు.. చరిత్రక విజయాన్ని అందించారని గుర్తుచేశారు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో పాటు.. రాష్ట్రంలో ఇంకా ఐదారు ఎయిర్‌పోర్ట్‌లు రాబోతున్నాయన్నారు చంద్రబాబు. కుప్పం, దగదర్తి, నాగార్జున సాగర్‌తో పాటు మూలపేటను కూడా పరిశీలిస్తున్నాం.. అవికాకుండా ఇతర ప్రాంతాలను కూడా పరిశీలిస్తామని వెల్లడించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..