Site icon NTV Telugu

CM Chandrababu: ఉగాది రోజున సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

CM Relief Fund

CM Relief Fund

ఉగాది పండగ రోజున పేదలకు సాయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.38 కోట్ల సీఎం సహాయ నిధి ఫైలుపై సంతకం చేశారు. దాంతో 3,456 మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్‌ ద్వారా రూ.281 కోట్లు విడుదల చేసింది. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుంది.

Also Read: Hardik Pandya: హార్దిక్‌ పాండ్యాకు షాక్‌.. మొదటి మ్యాచ్‌లోనే..!

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఉగాది పురస్కారాలను సీఎం ప్రదానం చేశారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. రూ.3.22లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని సీఎం తెలిపారు. ప్రజలు ఏ కార్యాలయానికీ వెళ్లకుండానే.. పనులు జరిగేలా వాట్సప్‌ గవర్నెన్స్‌ తీసుకొచ్చామన్నారు. 20 ఏళ్ల క్రితమే ఐటీ ప్రాధాన్యత గురించి తాను చెప్పానని, తన మాట విని ఆ రంగం వైపు వెళ్లిన వారు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారని సీఎం పేర్కొన్నారు.

 

Exit mobile version