CM Chandrababu: రహదారులపై ఫోకస్.. నేడు రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులతో సీఎం సమీక్ష
- ఆంధ్రప్రదేశ్‌లో దెబ్బతిన్న రోడ్లపై సీఎం చంద్రబాబు ఫోకస్..
- నేడు రోడ్లు మరియు భవనాల శాఖపై సీఎం సమీక్ష సమావేశం..
- రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల దుస్థితిపై చర్చించనున్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో దెబ్బతిన్న రోడ్లపై ఫోకస్ పెట్టబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేడు రోడ్లు మరియు భవనాల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల దుస్థితిపై చర్చించనున్నారు.. వర్షాకాలం రహదారులు మరింత దెబ్బతినే అవకాశం ఉన్నందున, ప్రజలు ఇబ్బంది పడకుండా.. ముందు గుంతలు పూడ్చేలా చర్యలకు ఆదేశించనున్నారు సీఎం.. అయితే, గత ఐదేళ్లు కాలంగా రహదారుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. దాంతో.. రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నాయనే విమర్శలు లేకపోలేదు.. ఇక, వర్షాకాలం వచ్చిందంటే చాలు.. రోడ్లపైకి రావాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఉందంటూ.. గతంలో.. టీడీపీ, జనసేన వివిధ సందర్భాల్లో ప్రత్యేక క్యాంపెయిన్లు కూడా నిర్వహించింది.. రోడ్లు దుస్థితిపై జనసేన సోషల్ మీడియా వేదికగా ఓ క్యాంపెయిన్ నిర్వహించిన విషయం విదితమే.. ఇప్పుడు రోడ్ల పరిస్థితిపై దృష్టిసారించారు సీఎం చంద్రబాబు.. ఈ రోజు జరిగే సమావేశంలో రహదారి మౌలిక వసతుల నిధితో విస్తరించాల్సిన రోడ్డు.. తదితర అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Bharateeyudu 2: భారతీయుడు సీక్వెల్ అవసరమా అనుకున్నా: శంకర్
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
కాగా, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓవైపు సమీక్షా సమావేశాలు.. మరోవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు.. మొదట పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ఆయన.. సమీక్ష నిర్వహించి.. పనుల పురుగతి తెలుసుకున్నారు.. ఇక, పోలవరం ప్రాజెక్టు కోసం విదేశీ నిపుణులను రంగంలోకి దించారు.. మరోవైపు.. రాజధాని ప్రాంతంలో పర్యటించి.. భవనాల నిర్మాణ పనులు ఎక్కడికి వచ్చాయన్నదానిపై సమీక్ష నిర్వహించి.. అమరావతి పనుల్లో కదలిక తెచ్చారు.. ఆ తర్వాత తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించి.. వరాల జల్లు కురిపించారు.. మరోవైపు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెన్షన్ల పంపిణీకి కూడా నిన్న మంగళగిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!