NTV Telugu Site icon

CM Chandrababu: ఏచూరితో కలిసి పని చేశాను.. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నా

Cm Chandrababu

Cm Chandrababu

ఢిల్లీలో సీతారాం ఏచూరి పార్థివ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎంపీలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని తెలిపారు. మంచి నాయకుడు, ఎల్లప్పుడూ పేద ప్రజలకు ఏం చేయాలని తపనపడే వ్యక్తి అని అన్నారు. తాను 40 సంవత్సరాలుగా క్లోజ్ గా సీతారాం ఏచూరిని వాచ్ చేశానని.. ఏచూరితో కలిసి పని చేశానని చంద్రబాబు చెప్పారు. ఎన్నో పోరాటాల్లో ఏచూరితో కలిసి ముందుకు సాగాం.. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణ వ్యక్తిగా సీతారాం ఏచూరి తయారయ్యారని అన్నారు. ఎక్కడో కాకినాడలో పుట్టిన వ్యక్తి ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చి జేఎన్యులో స్టూడెంట్ లీడర్ గా ప్రెసిడెంట్ అయ్యారన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల ఆసక్తి కనబరచడం.. అందులో చేరడం.. అంచలంచెలుగా ఎదిగి జాతీయస్థాయిలో పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Read Also: Sitaram Yechury: రేపు ఎయిమ్స్‌కి ఏచూరి పార్థీవ దేహం.. భౌతికకాయాన్ని ఏం చేస్తారు?.. డాక్టర్ మాటల్లో..

ఏచూరి.. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. అందరితో కలిసి ఉండేవాడు.. ఎవరు ఎప్పుడు కనబడిన నవ్వుతూ పలకరించే వారు.. అజాత శత్రువుగా ఎన్నో పోరాతాల్లో కలిసి ముందుకు సాగామని అన్నారు. తెలుగువాడిగా ప్రత్యేక ప్రసిద్ధి చెందారు.. దేశం మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయింది.. చాలా బాధాకరంగా ఉందని చంద్రబాబు చెప్పారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను.. తనకున్న అనుబంధంతో ఖచ్చితంగా చూడాలని, నివాళులు అర్పించాలని వచ్చానని చంద్రబాబు చెప్పారు. మనం ఉన్నా లేకున్నా మనం చేసిన పనులు శాశ్వతంగా ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు.

Read Also: Matrimonial fraud: మరో మాట్రిమోనియల్ ఫ్రాడ్.. ప్రభుత్వ ఉద్యోగినని మహిళలకు వల..ఆ తర్వాత బ్లాక్‌మెయిల్..