Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిత్యావసర సరుకుల ధరల నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ధరల పెరుగుదలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేసిన సీఎం, ఏడాది కాలానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అధికారులు ప్రతి వారం ధరల పరిస్థితిపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. సామాన్యులపై ధరల భారం పడకుండా ఉండేందుకు డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా కిలో కందిపప్పు రూ.100, కిలో గోధుమ పిండి రూ.25, లీటర్ పామాయిల్ రూ.125 చొప్పున విక్రయించాలని నిర్ణయించారు. అలాగే రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కే విక్రయించే ప్రక్రియను కొనసాగించనున్నారు.
ప్రభుత్వం ‘ధరణి’ బ్రాండ్‌తో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని విక్రయిస్తుండగా, మొబైల్ వాహనాల ద్వారా కూడా ప్రజల వద్దకే వెళ్లి బియ్యం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం ప్రభుత్వం నెలకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో బియ్యం నిల్వలు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా నిరంతర నిఘా పెట్టాలని, హోల్‌సేల్ డీలర్లు, మిల్లర్ల వద్ద ఉన్న నిల్వలపై అధికారులకు స్పష్టమైన సమాచారం ఉండాలని సూచించారు. ఈ క్రమంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకూడదని, అదే సమయంలో వినియోగదారులపై ధరల భారం పడకూడదని సీఎం స్పష్టం చేశారు.
Also Read
కందిపప్పు ధరల నియంత్రణతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కంది సాగును ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నాసిక్ రకం ఉల్లి సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. నిత్యావసరాలతో పాటు కూరగాయల ధరలు కూడా పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం మార్కెట్ వాచ్, అగ్రీవాచ్ నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు. ధరల నియంత్రణపై జిల్లాల వారీగా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించాలని, అక్రమ నిల్వలు, రవాణాపై విజిలెన్స్ నిఘాను మరింత పెంచాలని డీజీపీని సీఎం ఆదేశించారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
-
Ind Vs Nepal: నేపాల్‌పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
-
Student Suicide : శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. విద్యార్థి సంఘాల ఆందోళన..
-
OTR: రాజమహేంద్రవరం వైసీపీలో వెన్నుపోట్ల కలకలం
-
OTR: ఉరుములేని పిడుగులా ఆశిష్ షెలార్ ఎంట్రీ.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!