NTV Telugu Site icon

CM Chandrababu Naidu: కుప్పంపై సీఎం వరాల జల్లు..

Cbn

Cbn

CM Chandrababu Naidu: తన సొంత నియోజకవర్గం కుప్పంపై వరాల జల్లు కురిపించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం, బాధ్యతల స్వీకరణ, ఎమ్మెల్యేగా ప్రమాణం.. ఇలా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. తొలిసారి తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఆయన.. కుప్పం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.. ఓవైపు వర్షం జల్లు పడుతుండగా.. మరోవైపు.. వరాల జల్లు కురిపించారు సీఎం.. కుప్పంలో ఔటర్‌ రింగ్ రోడ్డు వేస్తాం… అన్ని రోడ్డు అభివృద్ధి చేస్తాం అన్నారు. కుప్పం మున్సిపాలిటీకి వందకోట్ల పైనే ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తా.. కుప్పంలో నాలుగు మండలాలను పదికోట్ల లెక్కన ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తాను.. కుప్పం అభివృద్ధి పనులు ఈరోజు నుండే ప్రారంభిస్తాం.. ప్రతి ఇంటి తాగునీరు అందిస్తాం.. పచ్చదనానికి కేరాఫ్ కుప్పాన్ని మారుస్తాను అని ప్రకటించారు.

Read Also: IND vs ENG : వ‌ర్షం ప‌డి సెమీస్ మ్యాచ్‌ ర‌ద్దైతే..? టీమిండియా నేరుగా..

730 కిలోమీటర్ల నుండి శ్రీశైలం నుండి వీకోట వరకు హాంద్రనీవా కాలువ ద్వారా నీళ్లు తెచ్చాను అని గుర్తుచేసుకున్న చంద్రబాబు.. ఐదేళ్ల వైసీపీ పాలనా కేవలం ఐదు కిలోమీటర్ల పనులు చేశారు.. ఎన్నికల ముందు సినిమా సెట్టింగ్ లు వేసి డ్రామాలు ఆడారని మండిపడ్డారు. హాంద్రీనీవా ద్వారా నీళ్లను కుప్పానికి తీసుకోస్తాను అని హామీ ఇచ్చారు. ఇక, కుప్పానికి ఎయిర్‌పోర్టు తీసుకొని రావాలి అన్నది నా కల.. కానీ, వైసీపీ నేతలు ఆ కలను నాశనం చేశారని మండిపడ్డారు. వీలైనంత త్వరగా కుప్పానికి విమానాశ్రయం తీసుకొని వస్తాను. ఎయిర్ కార్గ్ ద్వారా మన పంటల్ని విదేశాలకు పంపేలా చూస్తాను.. పది లక్షల ఉత్పత్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తాం.. కుప్పంలో కాడా ఏర్పాటు చేస్తాం.. ప్రత్యేక ఐఎఎస్ అధికారితో అభివృద్ధి చేస్తాను.. కుప్పంలో మరో కొత్త రెండు మండలాలను ఏర్పాటు చేస్తాను.. కుప్పంలో మొత్తం విద్యుత్ బస్సులు నడిచేలా ప్రణాళిక రూపొందించమని చెప్పినట్టు వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.