NTV Telugu Site icon

CM Chandrababu: ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ!

Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu Meets PM Modi: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికసాయం, ఇతర అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో చంద్రబాబు డిమాండ్లపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అంతకుముందు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు.. వివిధ అంశాలపై మాట్లాడారు.

Also Read: Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్ బచ్చనే మొదటి హీరో: అశ్వినీ దత్

మధ్యాహ్నం కేంద్రమంత్రులు అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం కేంద్రమంత్రులు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, హర్దీప్‌ సింగ్‌ పురీతో భేటీ కానున్నారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ.. రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎస్ నీరబ్ కుమార్, ప్రభుత్వ అధికారులు ఉన్నారు.

 

 

Show comments