NTV Telugu Site icon

Chandrababu: త్వరలో 1995 సీఎంను చూస్తారు.. వారికి చంద్రబాబు హెచ్చరిక

Chandrababu

Chandrababu

నూతన సంవత్సరం వేళ ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో 1995 సీఎంను చూస్తారని చంద్రబాబు అన్నారు. మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. తాను రాజకీయ కక్షలకు పాల్పడనని చెప్పారు. అలాగని.. తప్పు చేసే వాళ్లను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడతానని చెప్పుకొచ్చారు. సెకీ అంశం తనకు లాడ్డూ లాగే అనిపిస్తుందన్నారు. అమెరికా నుంచి పూర్తి కార్డు రాలేదన్నారు. వచ్చిన తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. ఇటీవల ఎక్కువగా చర్చ జరుగుతున్న సినీ అంశంపైన చర్చించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సినీ హబ్ ఉంది. అమరావతికి అంత అవసరంలేదు. గతంలో హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసినా.. సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదన్నారు. అమరావతి విషయంలో అది జరగదన్నారు.

READ MORE: Hyderabad Metro : హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు శుభవార్త.. మేడ్చల్, శామీర్‌పేట్‌ వరకు మెట్రో పొడగింపు..!

“ఇది చరిత్ర తిరగరాసిన సంవత్సరం. గత ఐదేళ్లు ప్రజలు పడిన ఇబ్బందులకు విముక్తి కలిగింది. ఇదే సమయంలో మీడియా కూడా ఇబ్బంది పడింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అందరికీ భవిష్యత్తుపై భరోసా వచ్చింది. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఉంది. ప్రజల ఆలోచనలు, అవసరాల మేరకు పాలనా విధానాలను మార్చుకుంటున్నాం. అధికారులు కూడా ప్రజల ఆకాంక్షల మేరకు పనితీరు మార్చుకోవాలి. ఎమ్మెల్యేలకు దశలవారీగా కౌన్సిలింగ్‌ ఇస్తున్నా. తప్పుడు పనులు చేయొద్దని వారిని పదేపదే హెచ్చరిస్తున్నా. సమాజానికి హానికరమైన వారిని మాత్రం వదిలేది లేదు. గతంలో రౌడీయిజం, మతకలహాలను అణచివేసినట్లే ఇప్పుడూ చేస్తాను.” అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

READ MORE: Anasuya: భర్త ముందే కైపెక్కించే అందాలతో బీచ్ ఒడ్డున కవ్విస్తున్న అనసూయ

 

Show comments