AP Cabinet: ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం (ఏప్రిల్ 10)న జరగనున్న క్యాబినెట్ సమావేశం జరగనుంది. రాజధాని అమరావతి కేంద్రంగా ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పార్లమెంట్‌లో అమరావతి రాజధాని చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే అంశం క్యాబినెట్ అజెండాలో ఉండే అవకాశం ఉంది. రాజధాని అభివృద్ధి, నిర్మాణ పనులపై సమగ్రంగా చర్చించనున్నారు.
IPL Trophy: తొలి టైటిల్ కోసం ఎదురుచూపులు.. ఆర్సీబీనే కాదు, చెన్నై-ముంబైకి తప్పని నిరీక్షణ!
ఇక పెట్టుబడుల విషయానికి వస్తే 16వ SIPB సమావేశంలో చర్చించిన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.39,436 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న క్వాంటమ్ వ్యాలీలో మూడు సంస్థల ఏర్పాటు ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా హైటెక్ రంగంలో పెట్టుబడులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగనున్నాయి.
Dale Steyn: చాలా పెద్ద తప్పు చేశాడు.. మిల్లర్ పై విరుచుకపడ్డ డేల్ స్టెయిన్..!
విద్యా రంగంలో కీలకంగా భావిస్తున్న ఫీజు రెగ్యులేటరీ కమిటీ (FRC) ఏర్పాటు ఆర్డినెన్స్‌కు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇది ఉపశమనం కలిగించే నిర్ణయంగా నిలవనుంది. అదేవిధంగా పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. మొత్తంగా రేపటి క్యాబినెట్ సమావేశం రాష్ట్ర అభివృద్ధి దిశను నిర్ణయించే కీలక భేటీగా నిలవనుంది.
