Dale Steyn: చాలా పెద్ద తప్పు చేశాడు.. మిల్లర్ పై విరుచుకపడ్డ డేల్ స్టెయిన్..!
- ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఒక్క పరుగుతో ఓటమి
- గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విజయం నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dale Steyn Slams David Miller Decision: ఐపీఎల్ 2026 14వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఒక్క పరుగుతో ఓటమి ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్ చివరి వరకూ పోరాడినప్పటికీ.. గుజరాత్ ఒక్క పరుగుతో థ్రిల్లింగ్ విజయం అందుకుంది. ఈ మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ అద్భుతంగా ఆడినప్పటికీ, చివర్లో తీసుకున్న ఒక నిర్ణయం విమర్శలకు దారి తీసింది. ఓడిపోతున్న మ్యాచ్ ను మిల్లర్ కేవలం 20 బంతుల్లో 41 పరుగులు చేసి విజయానికి దగ్గరగా తీసుకెళ్లాడు. అయితే మ్యాచ్ చివరి ఓవర్‌లో ప్రసిద్ కృష్ణ వేసిన బంతులు మ్యాచ్ రిజల్ట్ నే మార్చేశాయి.
GT Closest Wins : గుజరాత్ టైటాన్స్ చరిత్రలోనే క్లోజ్ విక్టరీ.. థ్రిల్లర్ విజయాల్లో టాప్‌లో జీటీ!
Also Read
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
చివరి ముందు బంతికి ఒక సింగిల్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ మిల్లర్ దాన్ని తిరస్కరించాడు. ఆ సింగిల్ తీసుకుంటే స్కోరు సమం అయి మ్యాచ్ సూపర్ ఓవర్ కు అయినా వెళ్లేది. ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న కుల్దీప్ యాదవ్ కూడా సింగిల్‌కు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు. అయినప్పటికీ మిల్లర్ తానే మ్యాచ్ ముగించాలని భావించి ఆ రన్ తీసుకోలేదు. దీనితో ఢిల్లీ మాస్క్ ఓడిపోయిందని చెప్పాలి.
ఇక ఈ నిర్ణయంపై మాజీ దక్షిణాఫ్రికా క్రికెటర్ డేల్ స్టెయిన్ విమర్శలు గుప్పించాడు. ఒత్తిడి సమయంలో అనుభవం ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని, ప్రమాదకరమైన షాట్ కు బదులుగా సేఫ్‌గా సింగిల్ తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. అధిక ఒత్తిడి పరిస్థితులలో ఆటగాళ్లు వారి నమ్మకం కంటే జట్టు విజయానికి అవసరమయ్యే క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని స్టెయిన్ అన్నారు. అంతకుముందు భారీ సిక్సర్ కొట్టడంతో మిల్లర్ ఆత్మవిశ్వాసం పెరిగిందని తాను భావించినప్పటికీ, అనుభవం కారణంగా అతను మరింత సురక్షితమైన పద్ధతిని అనుసరించి ఉండాల్సిందని స్టెయిన్ అన్నారు.
Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
మిల్లర్ లాంటి ఆటగాడు ఇలాంటి సందర్భంలో సింగిల్ తీసుకోవడం మిస్ అవ్వకూడదుని పేర్కొన్నాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో మిల్లర్ స్లో బాల్ ను మిస్ అయ్యాడు. ఆ తర్వాత తీసుకోవాలని ప్రయత్నించిన సింగిల్ లో రన్ అవుట్ కావడంతో ఢిల్లీ విజయాన్ని అందుకోవడంలో ప్లాప్ అయ్యింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఒక్క పరుగుతో సంచలన విజయం నమోదు చేసింది. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఈ సీజన్‌లో తొలి పరాజయం ఎదురైంది. ఇక ఏప్రిల్ 11న చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఢిల్లీ తలపడనుంది.
తాజావార్తలు
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..