AP Cabinet Meeting: చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. 30కి పైగా అంశాలపై ఫోకస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో 30కి పైగా అజెండా అంశాలపై కేబినెట్ చర్చించనుంది. ముఖ్యంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధి, ఏఐ డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, యువతకు ఉద్యోగాల కల్పన వంటి కీలక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) ఆమోదించిన పలు పరిశ్రమల ప్రతిపాదనలు, వాటికి కల్పించాల్సిన రాయితీలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
విశాఖ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌పై ప్రత్యేక దృష్టి
ఈ నెల 11, 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘CII పార్టనర్షిప్ సమ్మిట్-2026’పై కేబినెట్లో చర్చించనున్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకురావడం, అంతర్జాతీయ కంపెనీలను భాగస్వాములుగా చేసుకోవడం, పారిశ్రామిక రంగంలో కొత్త అవకాశాలను సృష్టించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లు, పెట్టుబడిదారులకు కల్పించాల్సిన సౌకర్యాలు, వివిధ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై సమీక్షించనున్నారు.
Also Read
- AP High Court: వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలకు మరో కేసు టెన్షన్..! హైకోర్టులో క్వాష్ పిటిషన్
- AP Cabinet Meeting: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్? రేపటి కేబినెట్ భేటీపై ఉత్కంఠ
- YS Jagan: రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు..! ప్రజాస్వామ్యం గురించి నీతులా? జగన్ సంచలన వ్యాఖ్యలు
- Perni Nani: పులివెందులలో గెలిచింది ఇలాగేనా..? టీడీపీ అరాచకానికి పరాకాష్ట..!
భారీ పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న భారీ పరిశ్రమల ప్రతిపాదనలు కేబినెట్ ముందుకు రానున్నాయి. విశాఖపట్నం జిల్లా రాంబిల్లిలో రూ.570 కోట్ల పెట్టుబడితో ఈప్యాక్ సంస్థ ఆధ్వర్యంలో డేటా సెంటర్ పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. నాయుడుపేటలో రూ.4,000 కోట్లతో కార్బన్ కాస్మో బ్యాటరీ తయారీ పరిశ్రమ, తిరుపతిలో రూ.700 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఇక, భీమిలి ప్రాంతంలోని అమనంలో రూ.31,387 కోట్ల భారీ పెట్టుబడితో ఏఎం ఇంటెలిజెన్స్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన కూడా కీలకంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లాలో రూ.237 కోట్లతో రావళి స్పిన్నర్స్ పరిశ్రమ విస్తరణకు సంబంధించిన అంశాన్ని పరిశీలించనున్నారు. అదేవిధంగా రాథీ గ్రీన్ ఎనర్జీ, న్యూల్యాండ్ ల్యాబ్స్ సంస్థలకు పెట్టుబడి ప్రోత్సాహకాలు కల్పించే ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నారు.
హెటెరోకు భూమి కేటాయింపు.. మహిళా పారిశ్రామిక పార్క్
పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపులపైనా కేబినెట్ చర్చించనుంది. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటెరో గ్రూపునకు 173.82 ఎకరాల భూమి కేటాయింపు ప్రతిపాదనను పరిశీలించనున్నారు. జగ్గయ్యపేటలో 30 ఎకరాల విస్తీర్ణంలో మహిళా పారిశ్రామిక పార్క్ ఏర్పాటు అంశం కూడా అజెండాలో ఉంది. మరోవైపు తిరుపతిలో వెబ్‌సోల్, మెట్రో డెకరేటివ్ సంస్థలకు గతంలో కేటాయించిన భూములను రద్దు చేసే ప్రతిపాదనలపై కూడా చర్చించనున్నారు. మరోవైపు.. భోగాపురంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా సెంటర్‌కు 24.96 ఎకరాల భూమి కేటాయింపు ప్రతిపాదన కేబినెట్ ముందుకు రానుంది. ఏఐ, డేటా సెంటర్ల రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఈ తరహా పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది.
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రోత్సాహం
రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత విస్తరించే దిశగా బయోగ్యాస్, సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూ కేటాయింపులు, అనుమతుల మంజూరుపై కేబినెట్ చర్చించనుంది. విజయవాడలో 15 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను కూడా పరిశీలించనున్నారు. అదేవిధంగా ఎస్ఎంఆర్ (స్మాల్ మాడ్యులర్ రియాక్టర్) టెక్నాలజీ ఆధారంగా రాష్ట్రంలో అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై చర్చించనున్నారు. మొత్తంగా ఈ కేబినెట్ సమావేశంలో పారిశ్రామిక పెట్టుబడులు, ఏఐ టెక్నాలజీ, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, బ్యాటరీ తయారీ, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. భారీ పరిశ్రమల రాకతో రాష్ట్రానికి పెట్టుబడులు పెరగడంతో పాటు స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. 30కి పైగా అంశాలతో కూడిన ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలకంగా మారనున్నాయి.
తాజావార్తలు
-
Kadem Project: ఫలించిన రైతుల పోరాటం.. 700 క్యూసెక్కుల నీరు విడుదల!
-
AP Cabinet Meeting: చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. 30కి పైగా అంశాలపై ఫోకస్..!
-
Karthika Masam 2026: రాజన్న ఆలయంలో కార్తీక మాసోత్సవాలు.. నెలరోజుల పాటు ప్రత్యేక పూజలు!
-
Best Flour for Winter: జొన్న, రాగి, మొక్కజొన్నలో ఏది బెస్ట్?.. చలికాలంలో ఏ పిండి రొట్టెలు తినాలి..?
-
Parliament Session Record: 89 రోజులుగా ప్రోరోగ్ కాని పార్లమెంట్.. 2008 నాటి రికార్డు బద్దలు..!
ట్రెండింగ్
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!