Site icon NTV Telugu

Anagani Satya Prasad: కడప జిల్లాలోకి రాజంపేట.. తిరుపతి జిల్లాలోకి రైల్వేకోడూరు!

Anagani Satya Prasad

Anagani Satya Prasad

ఏపీ క్యాబినెట్ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు సంబంధించి చర్చ జరిగింది. రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చడం అంశంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్యాబినెట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు ఆయన్ను ఓదార్చారు. క్యాబినెట్‌లో 24 అంశాలను చర్చించి ఆమోదం తెలిపినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలోకి మారుస్తున్నాం అని, రాజంపేటను కడప జిల్లాలోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. క్యాబినెట్ నిర్ణయాలను మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌తో కలిసి అనగాని మీడియాకు వెల్లడించారు.

‘జిల్లాల పునర్వ్యవిభజనపై క్యాబినెట్‌లో చర్చ జరిగింది. ప్రస్తుతం 17 జిల్లాలో మార్పులు వచ్చాయి. 17 జిల్లాల్లో 25 మార్పులు జరిగాయి. గూడూరులో ఉన్న కొన్ని మండలాలు తిరిగి నెల్లూరులో కలుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో పెనుగొండను వాసవీ పెనుగొండ మండలంగా పేరు మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలోకి మారుస్తున్నాం. రాజంపేటను కడప జిల్లాలోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నాం. రాయచోటిని మదనపల్లిలో కలిపి.. మార్పులు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి మారుతుంది. మదనపల్లి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుంది. ఈ దిశగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.

Also Read: AP News: మందు బాబులకు శుభవార్త.. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు!

మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… ‘కొత్త జిల్లాల ఏర్పాటులో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని నిర్ణయాలు తప్పవు. రాయచోటిని మదనపల్లికి షిఫ్టు చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి కలిపి ముందుకు వెళ్లడమే ఎజెండా. 2025లో జరిగిన అన్ని అంశాలు కూటమి పాలనపై సీఎం చంద్రబాబు క్యాబినెట్లో చర్చించారు. గ్రామ, వార్డు సచివాలయం పేరు మారుస్తూ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పేరుతో సచివాలయాలు పని చేస్తాయి’ అని తెలిపారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి క్యాబినెట్లో ప్రధానంగా చర్చ జరిగింది. సంక్షేమ పథకాల విషయంలో రాజీ పడకుండా ప్రజల వద్దకు చేరుస్తున్నాం. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాము’ అని మంత్రి సత్యకుమార్ చెప్పుకొచ్చారు.

Exit mobile version