NTV Telugu Site icon

AP Budget 2024: ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్‌ రూపకల్పన.. చాణక్యుడి పాలన అందిస్తున్నాం..

Ap Budget

Ap Budget

AP Budget 2024: ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్‌ను రూపకల్పన చేశామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర అనే 7 అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామన్నారు. గత ఐదేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు చేసిన ఖర్ఛులను మంత్రి వివరించారు. ఈ పథకాల అమలుతో సాధించిన ప్రగతిని వెల్లడించారు. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని వెల్లడించారు. ఇప్పటి వరకూ ఎవరూ చేయని పనులు మా ప్రభుత్వం చేసిందన్నారు.

Read Also: AP Budget 2024: ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ. 2,86, 389 కోట్లు

పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 2. 6 లక్షల మంది వాలంటీర్లను నియమించామన్నారు. . రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78 కి పెంచామని మంత్రి చెప్పారు. పాలనా పరమైన పునర్నిర్మాణంలో భాగంగా 13 కొత్త జిల్లాలు, 26 కొత్త రెవెన్యూ డివిజన్లు, పోలీసు డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు. కొత్త రెవెన్యూ, పోలీసు డివిజన్లను కుప్పంలో కూడా ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. . భద్రత , మౌళిక సదుపాయాలను కల్పించామన్న మంత్రి బుగ్గన.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామన్నారు. వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమల్లోకి తీసుకొచ్చామని అని బుగ్గన సభలో వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామన్న ఆయన.. వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమల్లోకి తీసుకొచ్చామన్నారు. రూ.3,367 కోట్లతో జగనన్న విద్యాకానుక అమలు చేస్తున్నామన్నారు. 47 లక్ష మంది విద్యార్థులకు విద్యాకానుక ఇచ్చామన్నారు. జగన్నన గోరుముద్ద పథకం కోసం రూ.1910 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. 9,52,925 ట్యాబ్స్‌ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశామని మంత్రి చెప్పారు. రూ.11,901 కోట్లతో జగనన్న విద్యాదీవెన పథకానికి ఖర్చు చేశామన్నారు. విదేశీ విద్యాదీవెన కింద 1,858 మందికి లబ్ధి చేకూర్చామన్నారు. రూ.4,267 కోట్లు జగనన్న వసతీ దీవెన ఖర్చు చేశామని మంత్రి బుగ్గన వెల్లడించారు. 20.37 శాతం నుంచి 6.62 శాతానికి డ్రాప్‌ అవుట్‌ తగ్గించామన్నారు.

Read Also: AP Cabinet: ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

మంత్రి బుగ్గన ప్రసంగిస్తూ.. “అందరికీ సమానంగా పాలన అందాలనే వికేంద్రీకరణ చేశాం. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా రూ.2356 కోట్లతో పనులు చేపట్టాం. సామర్ధ్య ఆంధ్రా ద్వారా మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నాం. మానవ మూలధన అభివృద్ధికి గత ఐదేళ్లుగా ప్రాధాన్యతా క్రమంలో పెట్టుబడి.ఐఎఫ్ పీ ప్యానెళ్లు ట్యాబ్ లను అందించటం ద్వారా బోదన, అభ్యాస ఫలితాలు మెరుగయ్యాయి. 4 వ తరగతి నుంచి 12 తరగతి వరకూ 34.30 లక్షల మంది విద్యార్ధులు మరింత ప్రతిభావంతులయ్యారు. నాడు నేడు ద్వారా ఐదేళ్లలో 99.81 శాతం పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు అందించాం. మొత్తం 7,163 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. సంపూర్ణ పోషణ, గోరుముద్ద పథకాల ద్వారా పోషణా లోపాన్ని 2023 నాటికి 6.84 శాతానికి తగ్గించాం. విదేశీ విద్యాదీవెన ద్వారా 1,858 మంది విద్యార్ధులకు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య ఇచ్చాం.” అని మంత్రి వెల్లడించారు.

రెవెన్యూ రాబడి ఇలా..
2024-25 ఆర్దిక సంవత్సరంలో రూ. 2,05,352 కోట్లు రెవెన్యూ రాబడి వస్తుందని అంచనా.

కేంద్ర పన్నుల ద్వారా రూ. 49,286 కోట్ల మేర వస్తుందని అంచనా.

రాష్ట్ర పన్నుల ద్వారా రూ.1,09,538 కోట్లు వస్తుందని అంచనా.

పన్నేతర ఆదాయంగా రూ. 14,400 కోట్లు.

గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా రూ.32,127 కోట్లు వస్తుందని అంచనా.

బహిరంగ మార్కెట్ ద్వారా రూ.71వేల కోట్లను రుణ సేకరణ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.

కేంద్రం నుంచి రూ. 61,642 కోట్లు రుణం తీసుకోవాలని యోచిస్తున్న ప్రభుత్వం.

ఇతర మార్గాల ద్వారా మరో రూ.25 వేల కోట్ల అప్పు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదన.

 

Show comments