NTV Telugu Site icon

Purandeswari: కూటమి విజయం చిన్నది కాదు.. ఇది ఒక హెచ్చరిక..!

Purandeswari

Purandeswari

Purandeswari: కూటమి విజయం అనేది చిన్న విజయం కాదు.. చాలా పెద్ద విజయం.. ఈ విజయం ఒక హెచ్చరిక లాంటిది అని మనం భావించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. గడిచిన ప్రభుత్వం చేసిన అవినీతి పాలన తీరుతో ప్రజలు ఒక గుణపాఠం తెలియచేశారు.. అధికారం వచ్చాక ప్రజా సంక్షేమన్ని పట్టించకపోతే ప్రజలు తమ ఓటుతో సరైన నిర్ణయం తీసుకుంటారని తెలియచేశారు.. రాష్ట్ర అభివృద్ధి కోసం పాలన చేయకుండా కక్షపూరిత ధోరణితో వ్యవహారిస్తే మాత్రం ప్రజలు సహించరని.. నిశ్శబ్ద ఓటుతో జవాబు ఇచ్చారని పేర్కొన్నారు..

Read Also: ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. ఫస్ట్ ప్లేసులో ఎవరంటే..?

కూటమితో పార్టీలు కలుస్తాయని తెలిసినప్పుడు కొందరు ఆశావాహులు సైతం నిర్ణయాన్ని గౌరవించి కూటమి కోసం సమన్వయంతో పని చేశారని గుర్తుచేశారు పురంధేశ్వరి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తిరిగి తీసుకురావడం కూటమి ప్రభుత్వం మీద ఉన్న బాధ్యతగా పేర్కొన్న ఆమె.. గత ప్రభుత్వం రాజధాని, పోలవరం నిర్మాణాలని నిర్వీర్యం చేసిందని విమర్శించారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని అమరావతి వీధి దీపాలతో శోభయానుమానంగా మారింది.. పార్టీ విధి విధానాలను ప్రతి కార్యకర్త ఒక బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ శక్తి నినాదంతో రాష్ట్రం అభివృద్ధి దిశలో ఉంటుంది అన్నారు. ఎన్డీఏ కూటమికి అనూహ్యమైన విజయానికి ప్రతి కార్యకర్త కస్టపడి పనిచేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.. ఇక, పదాధికారుల సమావేశానికి ముఖ్య అతిధిగా బీజేపీ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ హాజరయ్యారు.. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, రామకృష్ణా రెడ్డి, ఈశ్వరరావు, విష్ణు కుమార్ రాజు, పార్ధసారధి తదితర నేతలు.. మరోవైపు.. ఈ సమావేశంలో బీజేపీ తరపున గెలిచిన ఎంపీలను, ఎమ్మెల్యేలను సత్కరించారు బీజేపీ ఏపీ పదాధికారులు, జిల్లాల ఇంఛార్జ్‌లు..