NTV Telugu Site icon

Daggubati Purandeswari: అధిష్టానం ఏ పదవి ఇచ్చినా తీసుకుంటా!

Daggubati Purandeswari

Daggubati Purandeswari

క్షేత్ర స్ధాయిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని బలోపేతం చేయడంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తనవంతు పాత్ర పోషిస్తున్నారు. 50 రోజులు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేశారు. ఏపీలో జిల్లా అధ్యక్షులకు నియామకం పూర్తవడంతో.. ఇక అధ్యక్ష పదవిపై అందరి దృష్టి నెలకొంది. ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారధి ఉన్నారని తెలుస్తోంది. అయితే అధ్యక్ష రేసుపై బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు.

ఏపీ బీజేపీ అధ్యక్ష పదివి కోసం ఆశావహులు ఎందరైనా ఉండచ్చు, అందరి ఏకాభిప్రాయంతో, కార్యకర్తల క్రమశిక్షణ కారణంగా కమిటీలు వేసుకున్నాం అని దగ్గుబాటి పురంధేశ్వరి అంటున్నారు. కూటమి ప్రభుత్వం కావడంతో పార్టీలోనూ, అలాగే కూటమిలోనూ చర్చించే చేరికలుంటాయని అన్నారు. ‘రాష్ట్ర అధ్యక్షుల విషయంలో కేంద్ర నాయకత్వం టీంను నియామకం చేసుకుంటారు. రాజకీయ పరమైన కార్యాచరణ సైతం రాజకీయ పార్టీలకు అవసరం. ప్రజాసమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఉంది అని అమిత్ షా మాతో అన్నారు అని పురంధేశ్వరి తెలిపారు.. కేంద్ర సహకారం ప్రజల్లోకి తీసుకెళ్ళాలని తెలిపారు అమిత్ షా అని పురంధేశ్వరి అన్నారు. మా సిద్ధాంతాన్ని అర్ధం చేసుకుని పని చేసే వారిని ఆహ్వానిస్తాం. మూడు పార్టీల‌ మధ్య విబేధాలు రాకుండా అన్ని నిర్ణయాలుంటాయి. పార్టీ పడ్డలకు నామీద నమ్మకం ఉంది. అధిష్టానం ఏ పదవిని ఇచ్చినా నేను తీసుకుంటా’ అని ఎన్టీవీతో పురంధేశ్వరి తెలిపారు.