Purandeswari: కేంద్రం ఇస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసుకుంటున్నారు.. ఎస్సీలకు సంబంధించి కేంద్రం ఇచ్చిన 27 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ఏలూరు పర్యటనలో ఉన్న ఆమె.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రెండు మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్లబోతున్నాం.. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత మేలు చేశాం అనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ఇక, మంత్రి నారాయణ స్వామి వంటి వారు సైతం తనకి రిజర్వేషన్ ఉంది కాబట్టే వైసీపీ పార్టీలో పదవి వచ్చిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. కానీ, వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళను దేశ అత్యున్నత పదవిలో కూర్చోబెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందన్నారు. గడిచిన పదేళ్లుగా అందరికీ సంక్షేమం అందిస్తూ, అన్ని వర్గాలకు ప్రధాని నరేంద్ర మోడీ న్యాయం చేస్తున్నారని తెలిపారు. వికసిత భారత్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను జనంలోకి తీసుకు వెళ్తున్నామని వెల్లడించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
Read Also: Gyanvapi Mosque: నేడు జ్ఞాన్‌వాపీ ఏఎస్‌ఐ సర్వే నివేదికపై వారణాసి కోర్టు తుది తీర్పు