NTV Telugu Site icon

BJP: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల

Bjp

Bjp

BJP: ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. పది మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను విడుదల చేసింది.టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బీజేపీ ఐదో జాబితాలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఇదే.

*ఎచ్చర్ల : ఈశ్వరరావు

*విశాఖపట్నం వెస్ట్ : విష్ణు కుమార్ రాజు

*అరకు వ్యాలీ: రాజారావు

*ధర్మవరం : సత్యకుమార్

*అనపర్తి ; శివకృష్ణ రాజు

*కైకలూరు : కామినేని శ్రీనివాసరావు

*విజయవాడ వెస్ట్ : సుజనా చౌదరి

*బద్వేలు : బొజ్జ రోషన్

*జమ్మలమడుగు: ఆదినారాయణ రెడ్డి

*ఆదోని :పార్థసారథి