BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BC Reservations Case: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పుడు హస్తిన చేరుకుంది.. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీలో కీలక మంతనాలు జరిగాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు న్యాయ నిపుణులతో ఏపీ మంత్రులు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు పార్థసారథి న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు తదితర అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన చర్యలపై మంత్రులు న్యాయ నిపుణుల అభిప్రాయాలను తెలుసుకున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంలో అనుసరించాల్సిన వ్యూహం, కోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు అవసరమైన న్యాయపరమైన అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో తమ వాదనలను సమర్థవంతంగా వినిపించేందుకు అవసరమైన అన్ని అంశాలను సిద్ధం చేసుకోవాలని మంత్రులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. న్యాయ నిపుణులతో జరిగిన ఈ సమావేశం తదుపరి న్యాయపరమైన కార్యాచరణకు కీలకంగా మారే అవకాశం ఉంది.
Also Read
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
కాగా, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయతీరాజ్, పురపాలక శాఖలు జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే.. అదే సమయంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను అనుమతిస్తూ, ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈ నెల 1వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ)ను ఆదేశించింది హైకోర్టు.. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియ కొనసాగుతోందనే కారణంతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని స్పష్టం చేసింది. తుది ఓటర్ల జాబితా ప్రచురణ విషయంలో పంచాయతీరాజ్, పురపాలక శాఖలు చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది. సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం డిస్పోజ్ చేసింది. అయితే బీసీ జనగణన చేపట్టి, రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. అలాగే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను ఉపవర్గీకరణ చేసి రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ దాఖలైన మరో పిల్‌ను కూడా కొట్టివేసింది. వార్డుల పునర్విభజన ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీళ్లలోనూ హైకోర్టు జోక్యం చేసుకోలేదు. సెన్సెస్ కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్ వార్డుల పునర్విభజనపై ప్రభావం చూపబోదని స్పష్టం చేసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!