NTV Telugu Site icon

CM Chandrababu: నా దగ్గర డబ్బులు లేవు కానీ.. నూతన ఆలోచనలు ఉన్నాయి: సీఎం

Cm Chandrababu Naidu

Cm Chandrababu Naidu

తన దగ్గర డబ్బులు లేవని, కానీ నూతనమైన ఆలోచనలు మాత్రం ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 6 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాం అని, ఆదాయం స్వీడ్‌గా వస్తుందన్నారు. 1వ తేదీనే 64 లక్షల 50 వేల మందికి పింఛన్, జీతాలు ఇస్తున్నాం అని.. ధనిక రాష్ట్రాలు కూడా ఇంత పింఛన్ ఇవ్వడం లేదన్నారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు. రాష్ట్ర ఆస్తులు కాపాడతాం అని, అమ్మాయిలకు రక్షణ కల్పిస్తాం అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. బడ్జెట్‌పై శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు.

‘రాష్ట్ర ఆదాయం 13.5 శాతం పెరిగితే 76 వేల కోట్లు వొచ్చేది. తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ జీడీపీ అంచనా వేసుకునే వాళ్లం. 2014 నుండి 2019 వరకు 13 వేల కోట్లు తెలంగాణ కంటే జీఎస్టీ ఎక్కువగా ఉంది. 2023 నాటికి తెలంగాణకి 60 వేల కోట్లు ఎక్కువ వొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఒక్కరిపై లక్ష 35వేల రూపాయలు అప్పు ఉంది. గత పాలకులు అభివృద్ధి చేయకుండా.. బటన్ మాత్రమే నొక్కారు. బటన్ నొక్కితే ఏమైనా వొచ్చిందా?. ప్రవేట్ సంస్థలు రాలేదు.. అనేక ప్రవేట్ కంపెనీలు రాష్ట్రం వదలి వెళ్లిపోయాయి. పెట్టుబడిదారులు ఏపీపై నమ్మకం కోల్పోయారు. 25వేల కేసులు ప్రభుత్వంపై వేశారు. అధికారులు కోర్టులో చేతులు కట్టుకుని నిలబడ్డారు. సంపద లేదు.. ఆదాయం పెరగలేదు. ఆదాయం తగ్గడంతో ఆస్తులు తాకట్టు పెట్టారు. అప్పులు, వడ్డీ, జీతాలు.. ఇలా రాష్ట్రంలో అగాధంలోకి వెళ్ళిపోతుంది’ అని అన్నారు.

Also Read: CM Chandrababu: నా జీవితంలో ఇలాంటి విజయాన్ని చూడలేదు: సీఎం చంద్రబాబు

‘7 శ్వేత పత్రాలు విడుదల చేశాం. ప్రజలలో కూటమి ప్రభుత్వంపై అంచనాలు బాగా పెరిగాయి. రాష్ట్రం వెంటిలేటర్పై ఉంది. ఆస్తులు అమ్మాలి అన్నా.. లేకుండా చేశారు. రోజులు, గంటలు, నిమిషాలు లెక్కపెట్టుకొంటున్నాం. నా దగ్గర డబ్బులు లేవు కానీ.. నూతనమైన ఆలోచన ఉంది. 6 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాం. ఆదాయం స్వీడ్‌గా వస్తుంది. 1వ తేదీనే 64 లక్షల 50 వేల మందికి పింఛన్ ఇస్తున్నాం. జీతాలు కూడా ఇస్తున్నాం. ధనిక రాష్ట్రాలు కూడా ఇంత పింఛన్ ఇవ్వడం లేదు. 200 పైన అన్న క్యాంటీన్లు పెట్టాం. పేదవాడికి అన్నం పెట్టేదానికి ఎక్కడ అంతరాయం ఉండదు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే చూస్తూ ఉరుకోము. ఆస్తులు కాపాడతాం, అమ్మాయిలకు రక్షణ కల్పిస్తాం. రాబోయే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం చేసినా గోదావరి నుండి పెన్నా వరకు నీరు అందిస్తాం. సూపర్ 6లో దీపం 2 ఇచ్చాం. లక్షల కోట్ల రూపాయలకు శ్రీకారం చుడుతున్నాం. మన మీద నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయి. మరలా వైసీపీ అధికారంలోకి రాదు. చెత్తపై పన్ను తొలగించాం. వైసీపీ గుంతలు చేసి పోతే.. పూడ్చే పని మేము చేస్తున్నాం. 55 వేల కోట్లు నేషనల్ హైవేకి కేటాయిస్తున్నాం. 10 శాతం మద్యం షాపులను గీత కార్మికులకు కేటాయించిన ప్రభుత్వం మాదే’ అని సీఎం చెప్పుకొచ్చారు.