NTV Telugu Site icon

CM Chandrababu: నా జీవితంలో ఇలాంటి విజయాన్ని చూడలేదు: సీఎం చంద్రబాబు

Cm Chandrababu

Cm Chandrababu

తన జీవితంలో ఇలాంటి ఘన విజయాన్ని చూడలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 93 శాతం స్టైక్‌ రేట్‌తో గెలవడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తనపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ నం.1గా ఉండటానికి కారణం టీడీపీ పార్టీనే అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

బడ్జెట్‌పై శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. 2014లో లోటు కరెంట్‌ ఉండేది. పలు విధానాలు తీసుకొచ్చి… ఇప్పుడు మిగులు కరెంట్‌ పరిస్థితికి తెచ్చాం. రాష్ట్రంలో సరికొత్త ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. అమరావతి రైతులు నమ్మకంతో భూములు ఇచ్చారు. 2019లోనూ మేం విజయం సాధించి ఉంటే.. 2021లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. గత ప్రభుత్వం జీవోలను కూడా ఆన్‌లైన్‌లో పెట్టలేదు. విభజన నష్టం కంటే.. గత ఐదేళ్లలోనే ఎక్కువ నష్టం జరిగింది’ అని అన్నారు.

Also Read: Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌!

‘గత ప్రభుత్వం అన్ని వ్యవస్ధలను నాశనం చేసింది. గత ఐదేళ్లలో వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారు. అస్తవ్యస్థ ఆర్ధిక నిర్వహణలో రాష్ట్ర పరిస్ధితి వెనక్కి పోయింది. ఏపీ జీవనాడి పోలవరం పనులు పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కరువనేది రాదు. విద్యుత్ బకాయిలు పెట్టి ఓపెన్ మార్కెట్లో విద్యుత్ కొనాలని చూశారు. 1.29లక్షల కోట్ల నష్టంలోకి విద్యుత్ శాఖను నెట్టేశారు. గత ప్రభుత్వంలో మద్యం షాపుల్లో ఎక్కడా ఆన్ లైన్ పేమెంట్లు లేవు. భూములు లాక్కోవడానికి 22a తీసుకొచ్చారు. సంపద సృష్టించే ప్రాజెక్టులు ఆపేసారు, పెట్టుబడులు పెట్టేవారిని తరిమేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోయేందుకు సిద్ధంగా లేనని చెప్పాను. ఇప్పుడు భావితరాలకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం’ అని సీఎం చెప్పుకొచ్చారు.