AP Assembly Session: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా.. ఇప్పటికే సీఎం సహా కొందరు మంత్రులు పదవీ బాధ్యతలు స్వీకరించారు.. ఇక, రేపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు.. మరోవైపు.. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అందు కోసం ఈ నెల 21, 22 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు.. రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. ముందుగా ఈ నెల 24వ తేదీ నుండి సమావేశాలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం.. తాజాగా మార్పు చేస్తూ ఈ నెల 21, 22 తేదీల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది… రెండు రోజుల సభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. అదే విధంగా స్పీకర్‌ను కూడా ఎన్నుకోబోతున్నారు.. ఇక, ప్రొటెం స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనుండగా.. కొత్త స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడును ఎన్నుకుంటారని తెలుస్తోంది..
Read Also: Kalki 2898 AD: ఇద్దరు హీరోల ఆశలు అడియాశలే!!!