Site icon NTV Telugu

Virat Kohli: కోహ్లీని మీరైనా కాస్త ఆపండి.. అనుష్క శర్మకు స్పెషల్ రిక్వెస్ట్!

Virat Kohli Anushka Sharma

Virat Kohli Anushka Sharma

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్‌ శర్మ ఉన్నపళంగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే ‘కింగ్’ విరాట్‌ కోహ్లీ కూడా సాంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని విరాట్ బీసీసీఐకి కూడా తెలియజేశాడట. కీలకమైన ఇంగ్లండ్ పర్యటన ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని బీసీసీఐ కోరిందని సమాచారం. రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, మరికొన్ని సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ ఆడాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఓవైపు భారత మాజీ క్రికెటర్లు, మరోవైపు ఫాన్స్ కూడా విరాట్ కోహ్లీ ఇప్పుడే టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకొద్దని కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని కోహ్లీ సతీమణి అనుష్క శర్మకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు.’బాబీజీ..
టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావద్దని విరాట్ భాయ్‌కి మీరైనా కాస్త చెప్పండి’ అని ట్వీట్ చేశాడు. ఇందుకు తాజాగా విరాట్, అనుష్కలు ముంబైలో కలిసి వెళ్తున్న వీడియోను జత చేశాడు. ‘అనుష్క జీ.. కోహ్లీని మీరైనా కాస్త ఆపండి’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Ricky Ponting: విమానం ఎక్కాక.. మనసు మార్చుకున్న రికీ పాంటింగ్!

ఐపీఎల్ 2025 అనంతరం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. 5 టెస్టుల సిరీస్ జూన్ 20 నుంచి ఆరంభం కానుంది. త్వరలోనే బీసీసీఐ ఈ సిరీస్ కోసం జట్టును ప్రకటించనుంది. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌ తీసుకోకుండా బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ చర్చలు జరుపుతుందట. అనుభవజ్ఞుడైన విరాట్ ఇంగ్లండ్ సిరీస్‌లో భారత్‌కు కీలకమవుతాడని బీసీసీఐ భావిస్తోంది. చూడాలి మరి కింగ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో. ఇక ఐపీఎల్‌ 2025లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 505 పరుగులు చేశాడు. ఇందులో 7 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఈసారి బెంగళూరు తన ఐపీఎల్ టైటిల్ కలను సాకారం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Exit mobile version