NTV Telugu Site icon

Anurag Kashyap : పరిస్థితులు ఇప్పటికే చేయి దాటిపోయాయి.. మోడీ అప్పుడే చెబితే బాగుండు

Anurag Kashyap

Anurag Kashyap

సినిమాలపై వ్యాఖ్యానించవద్దని బీజేపీ కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఇచ్చిన సలహాపై సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ గురువారం స్పందించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో బాయ్‌కాట్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఏదైనా సినిమ రిలీజ్‌ అయినా, దానికి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ అయినా.. ఏ మతానికో, కులానికో కలుపుతూ నానా రద్దాంతం చేస్తున్నారు కొందరు. అంతేకాకుండా.. ఆ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. అయితే.. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, అందాల భామ దీపిక పదుకొణే నటించిన పఠాన్‌ సినిమాకు సంబంధించిన బేషరం సాంగ్‌పై రేగిన దుమారం అంతాఇంతా కాదు.

Also Read : Cheddi Gang: అమ్మో మళ్లీ వచ్చారు.. మహబూబ్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్

పఠాన్ సినిమా వివాదం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ‘బాలీవుడ్ బాయ్‌కాట్’ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే.. ఇటీవల సినిమాల విషయంలో అనవసర వివాదాల్లో తల దూర్చవద్దంటూ నేతలు, కార్యకర్తలకు మోడీ దిశానిర్దేశం చేశారు. అయితే.. మోడీ వ్యాఖ్యలపై అనురాగ్‌ కశ్యప్‌ స్పందిస్తూ.. మోదీ నాలుగేళ్ల క్రితం ఈ సూచన చేసి ఉంటే బాగుండేదని, ఇప్పటికే బాలీవుడ్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అన్నారు అనురాగ్‌. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఆల్‌మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్’ ట్రయిలర్ విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు ఇప్పటికే చేయి దాటిపోయాయన్న అనురాగ్‌.. ఎవరి మాట ఎవరూ వినే పరిస్థితుల్లో లేరన్నారు.

Also Read : Man Married Minor Girl: అరేయ్ ఏంట్రా ఇది..? ఏపీలో మైనర్‌ బాలికకు పబ్లిక్‌గా తాళికట్టేశాడు..