హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. అమ్మడు క్యూట్ నెస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజులో ఉంటుంది.. కాగా తాజాగా, సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్టు చేసింది.. తనకు ఎంగేజ్మెంట్ అయ్యిందని ట్యాగ్ చేసింది.ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
చిలిపి పోస్ట్స్ పెట్టడం హీరోయిన్స్ కి పరిపాటే. అప్పుడప్పుడు కవ్వించడానికి, కొన్ని సందర్భాల్లో చిత్ర ప్రమోషన్స్ కోసం తప్పుదోవ పట్టిస్తారు. ఆ మధ్య నిత్యా మీనన్ ఓ ప్రాజెక్ట్ ప్రమోషన్ కోసం తల్లి అయ్యానంటూ పోస్ట్స్ పెట్టింది. మొదట నిజమే అనుకున్నారు.. ఇక ఇప్పుడు అనుపమ కూడా అలాంటి షాక్ ఇచ్చారు. తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని ఫోటోలు పోస్టు చేసింది. చేతి వేలికి ఓ ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ కలరింగ్ ఇచ్చింది..
అయితే, అదంతా నిజం కాదని తెలుసుకొని నవ్వుకున్నారు.. అయితే ఇలాంటి అబద్దాలు చెప్పి ఫ్యాన్స్ ను హట్ చెయ్యొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇటీవల కార్తికేయ 2 లో నటించింది.. అది భారీ హిట్ ను అందుకోవడంతో అనుపమ మళ్లీ ఫాంలోకి వచ్చింది.. కార్తికేయ 2 అనంతరం విడుదలైన 18 పేజెస్ కమర్షియల్ గా ఆడలేదు. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ 18 పేజెస్ టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్స్ లో ఆడకున్నా ఓటీటీ లో బాగానే అలరించింది..బటర్ ఫ్లై టైటిల్ తో అనుపమ ఒక ఓటీటీ మూవీ చేశారు. అది కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగావుంది.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..